వన్డే ప్రపంచకప్ 2023 మెగా ఈవెంట్ కోసం 2016 తర్వాత దాయాది పాకిస్థాన్ టీమ్ 7 సంవత్సరాల తర్వాత భారత్ లో అడుగుపెట్టబోతుంది. అయితే ఈ విషయంపై పాకిస్థాన్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఆసియా కప్ 2023 టోర్నీలో ఇండియా ఆడే మ్యాచ్ లన్నీ తటస్థ వేదిక శ్రీలంకలో నిర్వహించేలా ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. దీంతో పాక్ ఆడే మ్యాచ్ లన్నీ కూడా తటస్థ వేదికపై నిర్వహించాలని ముందు నుంచి పాక్ క్రికెట్ బోర్డు పట్టుబట్టింది.
Read Also: Health Tips : వర్షాకాలంలో పొరపాటున కూడా వీటి జోలికి వెళ్ళకండి..
అయితే.. టీమిండియా ఓడిపోతామనే భయంతోనే పాకిస్తాన్‌తో సిరీస్ ఆడేందుకు ఇష్టపడడం లేదని పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ అన్నాడు. ‘ఇండియా- పాకిస్తాన్ జట్ల మధ్య మంచి గౌరవం, స్నేహం గతంలో ఉండేవి.. కానీ ఇప్పుడున్న టీముల్లో భారత జట్టు ఒక్కటే, పాకిస్తాన్‌తో సిరీస్‌లు ఆడడం లేదు.. వాళ్లు ఎందుకు ఆడడం లేదో తెలుసా.. పాక్ జట్టు పటిష్టంగా ఉంది.. ఒకవేళ ఆడితే ఓడిపోతామనే భయంతోనే మ్యాచ్ లు ఆడటం లేదని రజాక్ చెప్పాడు. ఇంతకు ముందు కూడా మాతో ఇండియా మ్యాచులు ఆడినప్పుడల్లా ఓడిపోయేవాళ్లు అంటూ వ్యాఖ్యనించాడు.
Read Also: Godavari River : రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల అద్దం పడుతున్న గోదావరి
ఇప్పుడు పరిస్థితి మారింది.. 2023లో ఉన్నాం.. ఇప్పటికైనా బీసీసీఐ ఆలోచనలు మార్చుకుంటే మంచిది అని అబ్దుల్ రజాక్ అన్నాడు. ఇప్పుడు చిన్న టీమ్ లేదు, పెద్ద టీమ్ లేదు.. ఆ రోజు ఏ టీమ్ బాగా ఆడితే అదే గెలుస్తుంది.. భారత జట్టు కూడా పాక్ టీమ్‌లాగే పటిష్టంగా ఉంది.. యాషెస్ సిరీస్‌లో ఏ జట్టు బలమైనదో చెప్పగలమా? అలాగే ఇండియా, పాకిస్తాన్‌లలో ఏ టీమ్ బలమైనదో చెప్పలేం అని అతడు తెలిపాడు.
Read Also: Minister Vidadala Rajini: మంత్రి విడదల రజనీకి అస్వస్థత.. వెంటనే బెజవాడకు..
ఇరు జట్ల మధ్య సంబంధాలు మెరుగు అవ్వాలంటే వరుసగా టీ20, టెస్టు, వన్డే సిరీస్‌లు జరగాలి అని పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ అన్నారు. అందుకు బీసీసీఐ ముందుకు వస్తే బాగుంటుంది.. అంటూ ఆయన కామెంట్ చేశాడు. జింబాబ్వే, నెదర్లాండ్స్ వంటి చిన్న టీమ్స్‌తో గెలవడానికి కూడా అపసోపాలు పడే పాక్ జట్టుతో ఆడేందుకు టీమిండియా ఎందుకు భయపడుతుందని అబ్దుల్ రజాక్ చేసిన వ్యాఖ్యలు… భలే కామెడీగా ఉన్నాయని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు.