NTV Telugu Site icon

IND vs AFG: అఫ్ఘాన్ బౌలర్లకు చుక్కలు చూపించిన రోహిత్, రింకూ..

India

India

టీమిండియా, అఫ్ఘనిస్థాన్ మధ్య జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో అఫ్ఘాన్ బౌలర్లకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, రింకూ సింగ్ చుక్కలు చూపించారు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (121), రింకూ సింగ్ (69) అజేయంగా నిలిచారు. ఒకానొక దశలో టీమిండియా 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత రోహిత్, రింకూ నిలకడగా ఆడి అఫ్ఘాన్ బౌలర్లకు ఊచకోత చూపించారు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో రోహిత్ శర్మ, రింకూ సింగ్ కలిసి 36 పరుగులు చేశారు. చివరి మూడు బంతుల్లో రింకూ హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు.

Battery Tips: ఈ ఐదు పనులు చేస్తే మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది.. జరజాగ్రత్త!

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ కు దిగిన టీమిండియా టాప్ ఆర్డర్ మొదట్లోనే కుప్పకూలింది. ఆఫ్ఘన్‌ పేసర్‌ ఫరీద్‌ అహ్మద్‌ మాలిక్‌ ఆరంభంలోనే మూడు వికెట్లు పడగొట్టి భారత్‌కు కోలుకోలేని దెబ్బ తీశాడు. విరాట్ కోహ్లీ, సంజూ శాంసన్‌లను గోల్డెన్ డక్‌తో ఔట్ చేశాడు. దీంతోపాటు 04 పరుగులకే జైస్వాల్‌కు పెవిలియన్ దారి చూపించాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ, రింకూ సింగ్ అఫ్ఘాన్ బౌలర్లకు ఊచకోత చూపించారు.

Ayodhya: అయోధ్యలో బాలరాముడి దర్శనం.. పరవశించిన భక్తులు

టీమిండియా బ్యాటింగ్ లో యశస్వి జైస్వాల్ 4, విరాట్ కోహ్లీ డకౌట్, శివం దూబే 1, సంజూ శాంసన్ డకౌట్ రూపంలో వికెట్లు పడిపోగా.. ఈ బ్యాట్స్ మెన్లు సిక్సర్లు, బౌండరీలతో చెలరేగి అఫ్ఘాన్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు. ఇక.. అఫ్ఘాన్ బౌలర్లలో ఫరీద్ మాలిక్ 3 వికెట్లు, అజ్మతుల్లా ఒమర్జాయ్ ఒక వికెట్ తీశాడు. మరీ ఈ భారీ లక్ష్యాన్ని చేధించాలంటే అఘ్ఘాన్ బౌలర్లు సిక్సర్లు, బౌండరీలు కొట్టాల్సి ఉంటుంది.