Site icon NTV Telugu

Team India: వరుసగా 20 ఓటముల తర్వాత టీమిండియాకు విజయం.. ఎందులోనే తెలుసా!

Kl Rahul Toss

Kl Rahul Toss

Team India: వరుసగా 20 వన్డే టాస్‌లు ఓడిపోయిన తర్వాత టీమిండియాకు కనీసం విశాఖపట్నంలోనైనా అదృష్టం కలిసి రావాలని క్రికెట్ ప్రేమికులు ప్రార్థించారు. అభిమానుల ఎదురు చూపులకు తెరదించుతూ చివరకు క్రికెట్ ప్రేమికులు ఎదురు చూసిన వార్తను పొందారు. విశేషం ఏమిటంటే.. వరుసగా 20 వన్డే టాస్‌లు ఓడిపోయిన తర్వాత కెప్టెన్ కేఎల్ రాహుల్ నేతృత్వంలో టీమిండియా జట్టు దక్షిణాఫ్రికాపై టాస్ గెలిచింది. దీంతో కెప్టెన్ కేఎల్ రాహుల్ బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.

READ ALSO: The Raja Saab : ది రాజా సాబ్ OTT డీల్ ఫైనల్.. రికార్డు ధరకు దక్కించుకున్న ప్రముఖ సంస్థ!

శుభ్‌మాన్ గిల్‌ను వన్డే కెప్టెన్‌గా తొలగించిన తర్వాత కూడా భారత్‌కు టాస్ ఓటములు తప్పలేదు. కొత్త కెప్టెన్‌గా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ ఫస్ట్ రాంచీలో టాస్ ఓడిపోయాడు, ఆ తర్వాత రాయ్‌పూర్‌లో కూడా అదే సీన్ రిపీట్ అయ్యింది. కానీ ఇప్పుడు ఆ ఓటములకు ముగింపు పలుకుతూ టీమిండియా టాస్ గెలిచింది. నిజానికి మొదటి రెండు మ్యాచ్‌లలో కూడా కెప్టెన్ కేఎల్ రాహుల్ తన ఎడమ చేతితో నాణేన్ని విసిరాడు, కానీ ఈ మ్యాచ్‌లో ఆయన తన కుడి చేతితో నాణేన్ని ఫ్లిక్ చేశాడు. సరిగ్గా 20 మ్యాచ్‌ల తర్వాత టీమిండియా టాస్ గెలిచింది. వాస్తవానికి రాయ్‌పూర్‌లో జరిగిన గత మ్యాచ్‌లోనే భారత్ టాస్ గెలుస్తుందని అభిమానులు ఆశించారు. కానీ ఫలితం ప్రతికూలంగా రావడంతో క్రికెట్ ఫ్యాన్స్ నిరాశ చెందారు. సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లలో టాస్ ఓడిన తర్వాత, మూడో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ టీమిండియా వరుసగా 20 టాస్ ఓటములకు ముగింపు పలికాడు. గత రెండు మ్యాచ్‌లలో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి టీమిండియా మొదట బ్యాటింగ్ చేసింది.

READ ALSO: Health Risks of Tea Bags: టీ బ్యాగులను వేడి నీటిలో ముంచి తాగుతున్నారా.. అయితే జాగ్రత్త

Exit mobile version