Site icon NTV Telugu

IND vs NZ: రోహిత్ ఖాతాలో మరో “హిట్టు”.. భారత్ ఘన విజయం..

India

India

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ ఘన విజయం సాధించింది. మ్యాచ్‌ చివరి వరకు ఎంతో ఉత్కంఠ కొనసాగింది. భారత్ 6 వికెట్ల నష్టానికి భారత్ 254 పరుగులు సాధించిన విజయ కేతనాన్ని ఎగురవేసింది. ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025ని కైవసం చేసుకుంది. టీమిండియా తాజా గెలుపుతో మరో ట్రోఫీని ఖాతాలో వేసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న జట్టుకు దాదాపు రూ. 19.48 కోట్లు ($ 2.24 మిలియన్లు) లభిస్తాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగుల సాధించిన విషయం తెలిసిందే. ఈ లక్ష్యాన్ని భారత్ అధిగమించింది. కెప్టెన్ 76 రన్స్‌తో అదరగొట్టాడు. విరాట్‌ కోహ్లీ అనుకున్నన్ని పరుగులు సాధించలేకపోయినప్పటికీ.. శ్రేయస్ అయ్యర్ (48) మాత్రం మెరిశాడు. భారత్‌కు ఇది మూడో ట్రోఫి.. 2002లో శ్రీలంకతో కలిసి సంయుక్త విజేతగా నిలవగా.. 2013లో ఇంగ్లాండ్‌ను ఓడించి ఛాంపియన్‌గా అవతరించింది.

READ MORE: INDvsNZ Final: రోహిత్ శర్మ గొంతులో పురుగు.. ఆందోళనకు గురైన రితిక

మొదట రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఓపెనర్లుగా రంగంలోకి దిగారు. శాంట్నర్ వేసిన 18.4 ఓవర్‌కు గ్లెన్ ఫిలిప్స్‌ గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో సూపర్ క్యాచ్‌ అందుకోవడంతో శుభ్‌మన్ గిల్ (31) పెవిలియన్ చేరాడు. అనంతరం రంగంలోకి దిగిన విరాట్‌ కోహ్లీ(1) బ్రాస్‌వెల్ వేసిన 19.1 ఓవర్‌కు ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది. రచిన్ రవీంద్ర వేసిన ఓవర్‌కు భారీ షాట్ ఆడే ప్రయత్నంలో రోహిత్ స్టంపౌటయ్యాడు. రోహిత్ శర్మ 83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 76 రన్స్ పూర్తి చేసుకున్నాడు. భారత్ కీలక సమయంలో శ్రేయస్ అయ్యర్ (48) ఔట్ అయ్యాడు. అక్షర్ పటేల్ బౌండ్రీలతో ఊపు తెచ్చిన అక్షర్(29).. మిచెల్ శాంట్నర్ వేసిన 41.3 ఓవర్‌కు ఓరూర్క్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ చేరాడు. క్రీజ్‌లోకి వచ్చిన కేఎల్ రాహుల్ మొదటి బంతిని బౌండ్రరీకి తరలించాడు. హార్దిక్ పాండ్యా (18), కేఎల్ రాహుల్ (32), జడెజా(5) పరుగులతో భారత్‌ను గెలిపించారు.

READ MORE: Turkey: టర్కీ మానవరహిత విమానం ప్రయోగాలు పూర్తి.. భారత్‌కి చిక్కులు..

Exit mobile version