NTV Telugu Site icon

Ind vs Pak: పాక్పై 6 పరుగుల తేడాతో గెలిచిన భారత్..

Ind Vs Pak

Ind Vs Pak

India vs Pakistan: టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా న్యూయార్క్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియా 6 పరుగుల తేడాతో గెలిచింది. వరుణుడు ఆటంకం కలిగించడంతో ఆలస్యంగా స్టార్టైన ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. పాక్‌ పేసర్ల ధాటికి 19 ఓవర్లలో కేవలం 119 రన్స్ మాత్రమే చేసి ఆలౌటైంది. పాక్‌ బౌలర్లలో నసీం షా, హరీస్‌ రౌఫ్‌ తలో 3 వికెట్లు తీసుకోగా, మొహమ్మద్‌ ఆమిర్‌ 2, షాహిన్‌ అఫ్రిది ఓ వికెట్‌ తీసుకున్నారు. ఇక, భారత ఇన్నింగ్స్‌లో రిషబ్‌ పంత్‌ (31 బంతుల్లో 42; 6 ఫోర్లు) మినహా అందరూ ఫెయిల్ అయ్యారు.

Read Also: Jammu Kashmir : యాత్రికుల బస్సుపై ఉగ్రవాదుల దాడిని ఖండించిన అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్

కాగా, కెప్టెన్ రోహిత్‌ శర్మ (12), హార్దిక్‌ పాండ్యా (12), అక్షర్‌ పటేల్‌ (20) రెండంకెల స్కోర్‌ చేయగా.. విరాట్‌ కోహ్లీ (4), సూర్యకుమార్‌ యాదవ్‌ (7), శివమ్‌ దూబే (3), రవీంద్ర జడేజా (0), అర్ష్‌దీప్‌ సింగ్‌ (9), బుమ్రా (0) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకు పరిమితమైయ్యారు. 120 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్థాన్.. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 113 పరుగులే చేసి ఓడిపోయింది. బుమ్రా (4-0-14-3), హార్దిక్‌ (4-0-24-2), సిరాజ్‌ (4-0-19-0), అర్ష్‌దీప్‌ సింగ్‌ (4-0-31-1), అక్షర్‌ పటేల్‌ (2-0-11-1) అద్భుతంగా బౌలింగ్‌ చేసి పాక్ ఓటమిని శాసించారు.

Read Also: Premgi Marriage: 45 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న ప్రముఖ కమెడియన్!

అయితే, పాకిస్తాన్ గెలవాలంటే ఆఖరి ఓవర్‌లో 18 రన్స్ చేయాల్సి ఉంది.. అర్ష్‌దీప్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి కేవలం 11 రన్స్ ఇచ్చాడు. అంతకు ముందు ఓవర్‌లో జస్ప్రీత్ బుమ్రా మ్యాజిక్‌ చేసి కేవలం 3 రన్స్ మాత్రమే ఇచ్చి ఓ వికెట్‌ తీసుకున్నాడు. ఈ గెలుపుతో భారత్‌ ప్రపంచకప్‌ టోర్నమెంట్లో పాక్‌పై తమ రికార్డును 7-1కి పదిలంగా ఉంచుకుంది. పాక్ ఇన్నింగ్స్‌లో మొహ​మ్మద్‌ రిజ్వాన్‌ (31) ఒక్కడే చెప్పుకోదగ్గ పరుగులు చేశాడు. ఈ ఓటమితో పాకిస్తాన్ సూపర్‌- 8 అవకాశాలను కఠినమైయ్యాయి.