Ind vs Pak: పాక్పై 6 పరుగుల తేడాతో గెలిచిన భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Pakistan: టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా న్యూయార్క్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియా 6 పరుగుల తేడాతో గెలిచింది. వరుణుడు ఆటంకం కలిగించడంతో ఆలస్యంగా స్టార్టైన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. పాక్ పేసర్ల ధాటికి 19 ఓవర్లలో కేవలం 119 రన్స్ మాత్రమే చేసి ఆలౌటైంది. పాక్ బౌలర్లలో నసీం షా, హరీస్ రౌఫ్ తలో 3 వికెట్లు తీసుకోగా, మొహమ్మద్ ఆమిర్ 2, షాహిన్ అఫ్రిది ఓ వికెట్ తీసుకున్నారు. ఇక, భారత ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ (31 బంతుల్లో 42; 6 ఫోర్లు) మినహా అందరూ ఫెయిల్ అయ్యారు.
Read Also: Jammu Kashmir : యాత్రికుల బస్సుపై ఉగ్రవాదుల దాడిని ఖండించిన అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్
Also Read
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
కాగా, కెప్టెన్ రోహిత్ శర్మ (12), హార్దిక్ పాండ్యా (12), అక్షర్ పటేల్ (20) రెండంకెల స్కోర్ చేయగా.. విరాట్ కోహ్లీ (4), సూర్యకుమార్ యాదవ్ (7), శివమ్ దూబే (3), రవీంద్ర జడేజా (0), అర్ష్‌దీప్ సింగ్ (9), బుమ్రా (0) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమైయ్యారు. 120 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్థాన్.. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 113 పరుగులే చేసి ఓడిపోయింది. బుమ్రా (4-0-14-3), హార్దిక్ (4-0-24-2), సిరాజ్ (4-0-19-0), అర్ష్‌దీప్ సింగ్ (4-0-31-1), అక్షర్ పటేల్ (2-0-11-1) అద్భుతంగా బౌలింగ్ చేసి పాక్ ఓటమిని శాసించారు.
Read Also: Premgi Marriage: 45 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న ప్రముఖ కమెడియన్!
అయితే, పాకిస్తాన్ గెలవాలంటే ఆఖరి ఓవర్‌లో 18 రన్స్ చేయాల్సి ఉంది.. అర్ష్‌దీప్ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 11 రన్స్ ఇచ్చాడు. అంతకు ముందు ఓవర్‌లో జస్ప్రీత్ బుమ్రా మ్యాజిక్ చేసి కేవలం 3 రన్స్ మాత్రమే ఇచ్చి ఓ వికెట్ తీసుకున్నాడు. ఈ గెలుపుతో భారత్ ప్రపంచకప్ టోర్నమెంట్లో పాక్‌పై తమ రికార్డును 7-1కి పదిలంగా ఉంచుకుంది. పాక్ ఇన్నింగ్స్‌లో మొహమ్మద్ రిజ్వాన్ (31) ఒక్కడే చెప్పుకోదగ్గ పరుగులు చేశాడు. ఈ ఓటమితో పాకిస్తాన్ సూపర్- 8 అవకాశాలను కఠినమైయ్యాయి.
తాజావార్తలు
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!