Amethi: విద్యార్థులకు టీచర్లు చిన్నప్పటి నుంచి శాంతంగా ఉండాలి. క్షమా గుణం కలిగి ఉండాలని చెబుతూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో వారే ఆ మాటలను ఆచరణలో పెట్టకుండా గాలికి వదిలేస్తూ ఉంటారు. ఎక్కడెక్కడో కోపాన్ని విద్యార్థుల మీద చూపిస్తూ వారిని చితకబాదుతూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో కొంత మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా చూశాం. తాజా ఓ టీచర్ స్టూడెంట్ ను విచక్షణారహితంగా చెంపపై కొట్టడంతో అతని కర్ణభేరి పగిలిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని అమేథీలో జరిగింది. దీనికి సంబంధించి బాధితుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Also Read: Patna: తాంత్రికుడు చెప్పడంతో కొడుకు కోసం కూతుళ్లను రేప్ చేసిన తండ్రి.. జీవత ఖైదు
ఆమె తెలిపిన వివరాల ప్రకారం అనిరుధ్ అనే 13 ఏళ్ల బాలుడు అమేథీలోని ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. ఇంగ్లీష్ క్లాస్ జరుగుతున్నప్పుడు అనిరుధ్ క్లాస్ లో పక్కవారితో మాట్లాడాడు. దీంతో ఇంగ్లీష్ టీచర్ శివ్ లాల్ జైస్వాల్ కు బాగా కోపం వచ్చింది. వెంటనే అనిరుధ్ ను పిలిచి చెంపపై కొట్టడం మొదలు పెట్టాడు. ఆ క్రమంలో అతని చెవిలో నుంచి రక్తం వస్తుందని తనని వదిలేయాలని కూడా అనిరుధ్ ఆ ఉపాధ్యాయుడిని బతిమిలాడాడు. అయిన కనికరం లేకుండా ఆ ఉపాధ్యాయుడు కొడుతూనే ఉన్నాడు. తరువాత అనిరుధ్ ను అతని తల్లి డాక్టర్ వద్దకు తీసుకువెళ్లగా అతని కర్ణభేరి పగిలిందని వైద్యులు తెలిపారు. దీంతో అనిరుధ్ తల్లి రీనా తివారీ ఆ ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసలు విచారణ చేపట్టారు. సంబంధిత సెక్షన్ల కింద టీచర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, తదుపరి చర్యలు తీసుకునే ముందు ప్రిన్సిపాల్, టీచర్ మరియు విద్యార్థుల స్టేట్‌మెంట్‌లను తీసుకుంటామని ఎస్‌హెచ్‌ఓ, అమేథీ, అరుణ్ కుమార్ ద్వివేది తెలిపారు. ఇక గతంలో కూడా ఓ టీచర్ ముస్లిం స్టూడెంట్ ను క్లాస్ లో ఉన్న అందరి చేత కొట్టించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆ ఘటన సంచలనం రేపింది. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.