ఏలూరు శ్రీవల్లి అపార్ట్‌మెంట్లో విషాదం చోటుచేసుకుంది. గవర్నమెంట్ టీచర్లుగా పనిచేస్తున్న భార్యాభర్తలు ఆత్మహత్య యత్నించారు. భార్య మృతి చెందగా.. భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. భర్త పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదని భార్య చిన్ని దేవీక ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఉరి వేసుకున్న భార్యను చూసి తట్టుకోలేక బ్లేడ్ తో చేతులు, కాళ్ళపై నరాలు కట్ చేసుకుని భర్త సురేంద్ర ఆత్మహత్యాయత్నం చేశాడు. రక్తంతో ఐలవ్యూ దేవికా అని నేలపై రాశాడు. గవర్నమెంట్ టీచర్స్ గా పనిచేస్తున్నారు చిన్ని దేవిక, చిన్ని సురేంద్ర.
Also Read:Dulquer : సీఎం రేవంత్ రెడ్డితో.. హీరో దుల్కర్ సల్మాన్ ప్రత్యేక భేటీ!
భార్య దేవిక ఉంగుటూరు మండలం నల్లమడు ఎలిమెంటరీ స్కూల్ టీచర్.. ఉంగుటూరు మండలం రాచూరు హై స్కూల్ హెడ్మాస్టర్ గా సురేంద్ర విధులు నిర్వహిస్తున్నాడు. విషయం తెలుసుకున్న బంధువులు సురేంద్రను గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందున్నాడు సురేంద్ర. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. దేవిక మృతిపై అనుమానాలు ఉన్నట్టుగా ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
