Site icon NTV Telugu

Telugu Teacher: తెలుగు సోది క్లాస్ అంటూ ఇన్‎స్టాలో పోస్ట్.. కర్ర విరిగేలా కొట్టిన టీచర్

Teacher

Teacher

Telugu Teacher: కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని మేనూర్ ఆదర్శ పాఠశాలలోని ఇంటర్మీడియట్ విద్యార్థినులను తెలుగు టీచర్ మహేశ్వరి విచక్షణ రహితంగా కొట్టారు. కొంత మంది విద్యార్థులు ఆమె ఫోటో తీసి ఇన్ స్టాగ్రామ్ లో సోది క్లాసు అంటూ పోస్ట్ చేశారు. టీచర్ కు ఈ విషయం తెలిసి స్టూడెంట్లను పిలిపించారు. ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది ఎవరు అని ప్రశ్నించారు. దీంతో పోస్ట్ చేసిన విద్యార్థిని తల్లిదండ్రులు తప్పయిందంటూ మరొకసారి ఇలా చేయమంటూ క్షమాపణలు కోరారు.

Read Also:Most Expensive Vegetable: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వెజిటబుల్.. కేజీ రూ.లక్ష

అయినా కోపంతో తెలుగు టీచర్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన విద్యార్థినులను కట్టెలు విరిగేలా కొట్టారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాల వచ్చి సదరు ఉపాధ్యాయురాలతో వాగ్వివాదానికి దిగారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన మీరు ఇలా విద్యార్థుల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టడమేంటని ప్రశ్నించారు. విద్యార్థులు తెలుగు టీచర్ ను సస్పెండ్ చేయాలంటూ పాఠశాల ముందు నిరసన చేపట్టారు. తెలుగు టీచర్ మహేశ్వరి కొంతకాలంగా విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని, ఇబ్బందికరమైన మాటలు మాట్లాడుతున్నారని విద్యార్థులు ఆరోపించారు.

 

Exit mobile version