ఈమధ్యకాలంలో మంచి విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు విద్యార్థుల్ని చితకబాదుతున్నారు. మద్యం మత్తులో ఇటీవల ఒక టీచర్ విద్యార్దులు కొట్టడం వివాదాస్పదం అయింది. హోంవర్క్ చేయలేదని, తరచూ బాత్ రూంకి వెళుతున్నారని, అల్లరి చేస్తున్నారని టీచర్లు పిల్లల్ని దండిస్తుంటారు. ఆ దండనలు కూడా తక్కువగా వుంటే ఫర్వాలేదు. కానీ అది శృతిమించితే పిల్లలు ఆస్పత్రి పాలవుతారు.
Read Also: Boora Narsaiah Goud: ఇవాళ బీజేపీలో చేరనున్న బూర నర్సయ్య గౌడ్
ఓ విద్యార్దిని ఆస్పత్రిలో చికిత్స కూడా అందుకుంటోంది. తాజాగా కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఓ టీచర్ విచక్షణ కోల్పోయింది. విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయురాలి తీరుపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. మానకొండూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందీ సంఘటన. \\
టీచర్ ఉగ్రరూపంతో బిక్కుబిక్కుమంటున్న విద్యార్థులు
ఎలాంటి కారణం లేకుండానే విద్యార్థులను కర్రతో చితకబాదింది ఉపాధ్యాయురాలు రాజ్యలక్ష్మి. పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఆదర్శ్, రామ్ చరణ్, శివకుమార్, విష్ణు, ప్రవీణ్ అనే విద్యార్థులు టీచర్ దెబ్బలకు తాళలేకపోయారు. కమిలిన గాయాలతోనే వసతి గృహంలో ఉన్నారు బాధిత విద్యార్థులు. విచారణ జరిపించి ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రుల డిమాండ్ చేస్తున్నారు. అధికారులు స్పందించకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. మరో వైపు ఇటీవల బెంగళూరులో ఓ పెద్ద స్కూల్ లో బీపీ వచ్చిన లెక్కల్ టీచర్ కొట్టిన దెబ్బలకు విద్యార్థి ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. మాస్టర్ కు బీపీ ఎక్కువ అయ్యిందేమో ఒకసారి చెక్ చేయించాలని విద్యార్థుల కుటుంబ సభ్యులు అధికారులకు సూచిస్తున్నారు.
Read ALso: Cricket: వన్డే ప్రపంచకప్-2023ను బాయ్‌కాట్ చేయనున్న పాకిస్థాన్