అభం శుభం తెలియని చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పి, వారిని తీర్చిదిద్దాల్సిన గురువే మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలోని రాయవరం మండలం మాచవరం గ్రామంలో చోటుచేసుకుంది. 4 నెలల క్రితం 9వ తరగతి విద్యార్థినిపై ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపాల్ జయరాజు లైంగిక దాడికి తెగపడ్డాడు.
POCSO Case: కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో 9వ తరగతి విద్యార్థిపై ఫోక్సో చట్టం క్రింద కేసు నమోదు అయింది. అయితే, వివరాల్లోకి వెళితే.. సహచర బాలికల ఇంస్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేసి.. ఆ బాలికల వ్యక్తిగత ఫోటోలు, ఫోన్ నెంబర్లను ఇతర విద్యార్థులకు ఇచ్చి వేధించాడు సదరు విద్యార్థి.