NTV Telugu Site icon

High Tension in Palnadu: పల్నాడు జిల్లాలో కొనసాగుతున్న అరెస్టులు..

Palnadu

Palnadu

High Tension in Palnadu: పల్నాడు జిల్లాలో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఎన్నికల ఘర్షణలలో దాడులకు పాల్పడ్డ నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. నిన్న పల్నాడు జిల్లాలో 60 మందికి పైగా అరెస్ట్ చేశారు. సిట్ టీమ్ దర్యాప్తు నేపథ్యంలో మరో 13 మందిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. వీడియో ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి పోలీసులు అరెస్టు చేస్తున్నారు. నిన్న దాచేపల్లి, తంగెడలాంటి ప్రాంతాల్లో పెట్రోల్ బాంబులతో దాడులు చేసుకున్న 33 మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. టీడీపీకి చెందిన 11 మంది నిందితులను గుంటూరు జైలుకు తరలించగా.. వైసీపీకి చెందిన 22 మందిని నెల్లూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు.

Read Also: NTR : ఎన్టీఆర్ ప్లాప్ సినిమాని రీమేక్ చేస్తానంటున్న విశ్వక్ సేన్..

ఇక, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను టీడీపీ- వైసీపీ నేతలు ధ్వసం చేశారు.. దీంతో ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. కాగా, పల్నాడులో పోలింగ్ రోజు జరిగిన అల్లర్లపై స్థానిక సీసీ టీవీ ఫుటేజ్‌ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని అరెస్ట్‌లు జరిగే ఛాన్స్ ఉంది. మరోవైపు కౌంటింగ్ సమయం దగ్గర పడుతుండటంతో పోలీసులు అలర్ట్ అవుతున్నారు. ఆయా కౌంటింగ్ కేంద్రాల దగ్గర పటిష్ట భద్రత ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే పల్నాడులో పోలీస్ పికెటింగ్ కొనసాగుతోంది. కౌంటింగ్ రోజు సైతం కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కౌంటింగ్ ముగిసిన తర్వాత కూడా 15 రోజుల పాటు పోలీస్ భద్రత కొనసాగనుందని పోలీసులు తెలిపారు.