NTV Telugu Site icon

TDP: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీరుని కలిసిన లోకేష్ నేతృత్వంలోని టీడీపీ బృందం..

Ap Governor

Ap Governor

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ని నారా లోకేష్ నేతృత్వంలోని టీడీపీ బృందం కలిసింది. నారా లోకేష్ తో పాటు అచ్చెన్నాయుడు, పీతల సుజాత, కొల్లు రవీంద్ర, అశోక్ బాబు, ధూళిపాళ్ల నరేంద్ర ఉన్నారు. జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో పాటు సామాజిక అన్యాయం గురించి గవర్నర్ దృష్టికి టీడీపీ బృందం తీసుకెళ్లింది. 53 నెలల పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీలపై జరిగిన దాడుల గురించి గవర్నర్ కు వివరించారు. పదో తరగతి చదివే బీసి బాలుడు అమర్నాథ్ గౌడ్ హత్యోందంతం మొదలుకుని దళితుడైన శ్యామ్ కుమార్ పై మూత్రం పోసి దాడి చేసి చేసిన ఘటన వరకు లోకేష్ టీమ్ గవర్నర్ కు తెలియజేశారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి సైతం గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.

Read Also: AUS vs AFG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్థాన్‌.. విరాట్ కోహ్లీ దోస్త్ వచ్చేశాడు! సెమీస్ బెర్త్ ఎవరిదో

ఇక, టీడీపీ కార్యకర్తలు, నేతలపై పెట్టిన కేసుల గురించి గవర్నర్ అబ్దుల్ నజీర్ కు లోకేష్ వివరించారు. వలంటీర్ వ్యవస్థని వైసీపీ దుర్వినియోగం చేస్తొందనే విషయాన్ని కూడా వివరించారు. ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతోన్న అంశాన్ని గవర్నర్ దృష్టికి టీడీపీ తీసుకెళ్లింది. వైఎస్ వివేకాని చంపిన కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చెయ్యకుండా సీబీఐని ప్రభుత్వమే అడ్డుకున్న సంఘటన గురించి లోకేష్ గవర్నర్ దృష్టికి తీసుకుపోయారు. యువగళం పాదయాత్రలో ఎదురైన ఇబ్బందులను సైతం వారు తెలిపారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఉండకూడదన్న లక్ష్యంతో జగన్ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారన్న టీడీపీ నేతలు ఆరోపించారు.

Read Also: Payal Rajput: చీరకట్టులో ముసి ముసి నవ్వులతో మెరుస్తున్న పాయల్ రాజ్‌పుత్….

చంద్రబాబుపై ప్రభుత్వం పెడుతున్నవి అక్రమ కేసులేనని అంశాన్ని ఆధారాలతో సహా గవర్నర్ కి టీడీపీ నేతలు వివరించారు. ఎటువంటి ఆధారాలు లేకుండా స్కిల్ డెవలప్మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్, ఇసుక విధానం, లిక్కర్ పాలసీ అంటూ అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని లోకేష్ వివరించారు. చంద్రబాబు పైనే కాకుండా తప్పుడు కేసులతో కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతున్నారని గవర్నర్ వారు తీసుకెళ్లారు. జైల్లోనే చంద్రబాబు చస్తాడు అంటూ వైసీపీ ఎంపీ మాధవ్ అన్న మాటలను గవర్నర్ తెలియజేశారు.

Read Also: Sara Ali Khan: సారా అలీఖాన్ పొట్ట తెగ పెరిగిపోతుందట.. ఇది అదేనేమో జర జాగ్రత్త

ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు అడ్డుకట్ట వేసేలా రూపొందించిన 17ఏ సెక్షన్ ని సైతం తుంగలో తొక్కుతున్నారని గవర్నర్ దృష్టికి టీడీపీ టీమ్ తీసుకుపోయింది. గవర్నర్ వ్యవస్థను కూడా గౌరవించకుండా జగన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుని గవర్నర్ అబ్దుల్ నజీర్ కి లోకేష్ వివరించారు. జగన్ హయాంలో ఇసుక, కల్తీ మద్యంలో జరుగుతున్న అవివీతిని గురించి తెలిపారు. ఓ వైపు దోపిడీతో కోట్లు కొట్టేస్తూ చంద్రబాబు గారిపై రివర్స్ కేసులు పెట్టడాన్ని గవర్నర్ కి నివేదించారు. జగన్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు చెక్ పెట్టేలా రాజ్యాంగంలోని ఆర్టికల్ 355 ప్రకారం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ కు టీడీపీ నేతలు కోరారు.