ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు తిరుమలలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 10.30గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ చేరుకోనున్నారు. అనంతరం పద్మావతి అతిథి గృహంలో విశ్రాంతి తీసుకుని మధ్యాహ్నం 3 గంటలకు మహిళా వర్సిటీలో నిర్వహించనున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొంటారు.
Vizag: భారతదేశం - పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో విజయానికి ప్రతీకగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 4 న నేవీ డే జరుపుకుంటారు. విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది.
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ని నారా లోకేష్ నేతృత్వంలోని టీడీపీ బృందం కలిసింది. జగన్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు చెక్ పెట్టేలా రాజ్యాంగంలోని ఆర్టికల్ 355 ప్రకారం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ కు టీడీపీ నేతలు కోరారు.
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను టీడీపీ నేతల బృందం కలిసింది. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు అరెస్ట్ అంశంతో పాటు రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలను గవర్నరుకు తెలుగు తమ్ముళ్లు వివరించారు.