Site icon NTV Telugu

Ayyanna Patrudu: బండారు విషయంలో ఆ నిబంధన ఎందుకు ఫాలో అవ్వడం లేదు..

Ayyanna Patrudu

Ayyanna Patrudu

Ayyanna Patrudu: రాష్ట్రం కోసం చావడానికైనా సిద్ధం కానీ ఈ ప్రభుత్వం ఒత్తిళ్లకు లొంగమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. మా కుటుంబాల మీద రోజా చేసిన వ్యాఖ్యలు ఆధారాలతో సహా ఇస్తాం మంత్రి మీద కేసు పెట్టే దమ్ము పోలీసులకు ఉందా అంటూ అయ్యన్న సవాల్‌ విసిరారు. బండారు మీద పెట్టిన సెక్షన్లు అన్నీ బెయిల్ బుల్ సెక్షన్‌లు అని.. 41 నోటీసులు ఎందుకు ఇవ్వడం లేదో పోలీసులు చెప్పాలన్నారు. సీనియర్ సిటిజన్‌లకు 41నోటీసులు ఇచ్చి స్టేషన్‌కు తీసుకుని వెళ్లకూడదని చట్టం చెబుతోందన్నారు. బండారు విషయంలో ఆ నిబంధన ఎందుకు ఫాలో అవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. వైసీపీ పాలనలో ఏ వర్గానికి మర్యాద లేదని విమర్శలు గుప్పించారు.

Also Read: Bandaru Satyanarayana: మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత

రాష్ట్రంలో తప్పుడు కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. రాజకీయాల్లో మళ్లీ మళ్లీ గెలవాలని కోరుకోవడం తప్పు లేదని, కానీ ఇంత కంటే దుర్మార్గమైన ఆలోచనలు ఎప్పుడు చూడలేదన్నారు టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు. ఇందిరాగాంధీ మెడలు వంచిన ఘనత టీడీపీదని ఆయన పేర్కొన్నారు. వైసీపీకి రాజకీయ సమాధికట్టాలిసిన సమయం దగ్గరపడిందన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అన్ని పార్టీలు కలిసి పోరాటం చేయాలని ఆయన పేర్కొన్నారు. బండారు ఫ్యామిలీని అక్రమ నిర్బంధం చేసిన డీఎస్పీ, సీఐలుపై హైకోర్టుకు ఫిర్యాదు చేస్తామన్నారు. తప్పు చేస్తే ఉరితీయండి, అంతే కానీ చట్టాలు ఉల్లంఘన చేయవద్దని పోలీసులను కోరుతున్నామన్నారు.

 

Exit mobile version