TDP Final List: ఎన్నికల షెడ్యూల్ రాకముందు నుంచే పొత్తులు, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తూ వస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు ఫైనల్ లిస్ట్ విడుదల చేశారు.. పొత్తుల్లో భాగంగా మొత్తం 144 అసెంబ్లీ స్థానాలకు, 17 లోక్‌సభ స్థానాల నుంచి టీడీపీ బరిలోకి దిగనున్న విషయం విదితమే కాగా.. ఈ రోజు నలుగురు ఎంపీ అభ్యర్థులు, 9 మంది అసెంబ్లీ అభ్యర్థులతో ఫైనల్ లిస్ట్ విడుదల చేసింది.. అయితే, ఆది నుంచి టికెట్ కోసం ఎదురుచూస్తోన్న కొందరు సీనియర్లకు ఈ జాబితాలో చోటు కల్పించింది.. అయితే, కదిరి అభ్యర్థిని టీడీపీ మార్చేసింది.. కందికుంట ప్రసాద్ భార్య యశోదకు బదులుగా ప్రసాద్‌కే సీటు కేటాయించింది టీడీపీ అధిష్టానం..
టీడీపీ లోక్‌సభ అభ్యర్థుల పేర్లు.. పోటీ చేసే స్థానాలు
1. విజయనగరం – అప్పలనాయుడు
2. ఒంగోలు – మాగుంట శ్రీనివాసులరెడ్డి
3. అనంతపురం – అంబికా లక్ష్మినారాయణ
4. కడప – చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి
టీడీపీ అసెంబ్లీ అభ్యర్థుల పేర్లు.. పోటీ చేసే స్థానాలు
1. చీపురుపల్లి – కళా వెంకట్రావు
2. భీమిలి – గంటా శ్రీనివాసరావు
3. పాడేరు – వెంకటరమేష్ నాయుడు
4. దర్శి – గొట్టిపాటి లక్ష్మి
5. రాజంపేట – సుగవాసి సుబ్రహ్మణ్యం
6. ఆలూరు – వీరభద్ర గౌడ్
7. గుంతకల్లు – గుమ్మనూరు జయరాం
8. అనంతపురం అర్బన్ – దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్
9. కదిరి – కందికుంట వెంకటప్రసాద్ పేర్లను ప్రకటించింది టీడీపీ..