NTV Telugu Site icon

MP Kesineni Nani: చంద్రబాబు అరెస్ట్‌ విషయంలో జోక్యం చేసుకోండి.. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రికి లేఖ

Kesineni Nani

Kesineni Nani

MP Kesineni Nani: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై ఆ పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన సాగుతుండగా.. ముందస్తు చర్యల్లో భాగంగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు.. ఇతర నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేశారు పోలీసులు.. ఇక, ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి.. ఈ నేపథ్యంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని ఈ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు విడివిడిగా లేఖలు రాశారు ఎంపీ కేశినేని నాని..

Read Also: Health Tips: గ్రీన్ టీలో వీటిని కలిపి తాగితే.. ఏం జరుగుతుందో తెలుసా?

ప్రజాస్వామ్యాన్ని, న్యాయాన్ని రక్షించాంటూ విడివిడిగా రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రికి రాసిన లేఖల్లో పేర్కొన్నారు కేశినేని నాని.. చంద్రబాబుపై రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేదు.. ఆధారాల్లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారని తెలిపారు. రాజకీయ కక్షతో ఈ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు. ప్రజల్లో ఏపీ పోలీసులపై నమ్మకం పోయింది. అక్రమంగా జరిగిన చంద్రబాబు అరెస్ట్ వ్యవహరంలో కేంద్రం జోక్యం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని తన లేఖల ద్వారా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. మరోవైపు.. చంద్రబాబు దేశ రాజకీయాల్లోనే నిజాయితీ కలిగిన వ్యక్తి అని.. అవినీతి మచ్చ లేని నాయకుడు అని ఎంపీ కేశినేని నాని కొనియాడిన విషయం విదితమే.. ఐటీ నోటీసులు పెద్ద విషయం కాదని.. దానికి వివరణ ఇస్తారని.. ఇవన్నీ తాత్కాలికమేనన్నారు. తాను టీడీపీలోనే ఉన్నానని.. వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీ నుంచే ఎంపీగా పోటీ చేస్తానని కేశినేని నాని స్పష్టం చేసిన విషయం విదితమే.