AP Assembly budget Session: అసెంబ్లీ సమావేశాల చివరి రోజు.. బహిష్కరించిన టీడీపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Assembly budget Session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చివరి రోజుకు చేరుకున్నాయి.. అయితే, అసెంబ్లీ సమావేశాల చివరి రోజును తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బహిష్కరించారు.. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం వినాశక చట్టాలు చేసిందని.. ఆ ప్రతులను అసెంబ్లీ బయట తగలుబెట్టారు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. మూడు రాజధానులు చట్టం, మద్యం అమ్మకాల తాకట్టు, మీడియాపై ఆంక్షలు వంటి జీవోలు దహనం చేశారు.. పోలవరం రివర్స్ టెండరింగ్ ప్రతులు, ఇతర ప్రజా వ్యతిరేక నిర్ణయాల ప్రతులను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దగ్ధం చేశారు. ఈ ప్రభుత్వానికి ఇదే చివరి అసెంబ్లీ రోజు అంటూ నినాదాలు చేశారు. నేటితో రాష్ట్రానికి పట్టిన శని, దరిద్రం వదిలిపోయిందని నినదించారు టీడీపీ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు.
Read Also: Kapu Ramachandra Reddy: నా భవిష్యత్తేంటో పైవాడే నిర్ణయిస్తాడు..
Also Read
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
- Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
- Jana Sena - TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
- రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
ఇక, ఈ సందర్భంగా టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఐదేళ్ల శాసనసభ చీకటి సభే.. చివరి రోజు కూడా యాత్ర సినిమా కోసం సభను 2 గంటలు వాయిదా వేశారని విమర్శించారు.. ఇక, టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. ఐదేళ్ల శాసనసభలో ప్రతీ రోజూ బ్లాక్ డేనే అని విమర్శించారు. ప్రజల ఆత్మాభిమానం, ఆత్మగౌరవం శాసనసభ లో మంటగలిసిందంటూ ఫైర్ అయ్యారు. మరోవైపు.. ఆశా వర్కర్లపై లాఠీచార్జ్ చేయడం జగన్ రెడ్డి నిరంకుశ పాలనకు నిదర్శనం అని మండిపడ్డారు అచ్చెన్నాయుడు.. సమస్యలు పరిష్కరించమంటే అక్రమ అరెస్ట్ చేసి నిర్బంధిస్తారా? ఐదేళ్లుగా ఆశాలతో జగన్ రెడ్డి వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. ఆదాయ పరిమితి నిబంధనతో ఆశాలను సంక్షేమానికి దూరం చేశారు. సెలవులివ్వకుండా, పని భారంతో ఒత్తిడి పెంచడం అమానుషం కాదా? ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే నిరసన తెలిపడం నేరమెలా అవుతుంది? అని ప్రశ్నించారు. తక్షణమే ఆశా వర్కర్ల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలి. సకాలంలో వేతనాలతో పాటు ఉద్యోగ భద్రత కల్పించి, పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు అచ్చెన్నాయుడు.
తాజావార్తలు
-
Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
-
Dancers Association Issue: ఫిలిం ఛాంబర్ ను ముట్టడించిన తెలంగాణ వాదులు?
-
Sumalatha: ఫిలిం ఫెడరేషన్ అధ్యకుడు అనిల్ ను సస్పెండ్ చేయాలి
-
IND vs SL Semi Final: భారత్, శ్రీలంక సెమీఫైనల్‌కు వర్షం ముప్పు?.. మ్యాచ్ రద్దైతే ఫైనల్ బెర్త్ ఎవరిది?
-
Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!