టాలీవుడ్ ప్రేక్షకులకు మంచు లక్ష్మీ పేరు సుపరిచితమే.. మంచు మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కూడా తన టాలెంట్ తో విలక్షణ నటిగా ఎన్నో సినిమాల్లో నటించి అందరిని మెప్పించింది.. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా వ్యాఖ్యతగా వ్యవహారిస్తూ అందరి మనసులను ఆకట్టుకుంది..ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫొటోలతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది.. తాజాగా మంచు లక్ష్మీ కొత్త ఇంటికి సంబందించిన వీడియోను షేర్ చేసింది.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
బాలీవుడ్ లో పాగా వెయ్యాలనో లేక ఇతర కారణాల వల్లో తెలియదు కానీ మంచు లక్ష్మీ ముంబైకి మకాం మార్చేసింది.. మంచు లక్ష్మీ మాత్రం ముంబైలో ఓ ఫ్లాట్ తీసుకుంది. అయితే అది పర్మనెంట్ ఫ్లాట్ కాదని చెప్పేసింది. అందుకే కొత్త వస్తువులు కొనడం ఎందుకుని హైద్రాబాద్‌లోని ఇంటి నుంచే తనకు ఇష్టమైన, నచ్చిన వస్తువులను హైదరాబాద్ నుంచి ముంబై కొత్త ఇంటికి తెచ్చేసుకుంది..
మాములుగా ముంబైలో ఇల్లు దొరకడం కష్టం అని చాలా మంది చెప్పారు.. కానీ చాలా ఇళ్లని చూశానని, ఆ దేవుడే ఈ ఇంటికి తీసుకొచ్చాడంటూ మంచు లక్ష్మీ చెప్పుకొచ్చింది. అయితే ఇంట్లోని ఆర్ట్ వర్క్‌ని చూపించింది.. గతంలో హైదరాబాద్ లో చేసిన హోమ్ టూర్ వీడియోకు జనాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.. అందుకే ఇప్పుడు ముంబై ఇంటి హోమ్ టూర్ చేసినట్లు తెలుస్తుంది.. ప్రస్తుతం ఈ కొత్త ఇంటి వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది..