TDP: రంగంలోకి టీడీపీ అధిష్టానం.. అసంతృప్త నేతలకు బుజ్జగింపులు..!
TDP: ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. ఓవైపు ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెడుతూనే.. మరోవైపు అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో పడిపోయింది తెలుగుదేశం పార్టీ అధిష్టానం.. కర్నూలు జిల్లాలో సీటు దక్కని అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో టీడీపీ హైకమాండ్ పడిపోయింది.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ రెబెల్స్ గా పోటీకి సిద్ధమవుతోన్న పలువురు నేతలను సంప్రదింపులు జరుపుతున్నారు.. ముఖ్యంగా కోడుమూరు, ఆదోని, మంత్రాలయం టీడీపీలో తీవ్రమైన సమస్యలే ఎదుర్కోవాల్సి వస్తోంది అధిష్టానం.. కోడుమూరులో ఆకెపోగు ప్రభాకర్, ఆదోనికి చెందిన మీనాక్షి నాయుడు, మంత్రాలయం నియోజకవర్గానికి చెందిన తిక్కారెడ్డితో చర్చలు జరుపతున్నారు పార్టీ జోనల్ ఇంఛార్జ్ బీద రవిచంద్ర నేతృత్వంలోని టీడీపీ నేతల బృందం.
Read Also: Billionaire Barber: సింగల్ పేమెంట్.. ఒకేసారి 3 బెంజ్ కార్లు కొన్న బిలియనీర్ బార్బర్..!
Also Read
- Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌కు చరమగీతం..?
- MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్‌కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
- Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
- KKR Vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరో విజయానికి బ్రేక్..? కేకేఆర్‌లోకి స్టార్ ప్లేయర్ ఎంట్రీ..
ఇప్పటికే కోడుమూరులో ప్రభాకర్, మంత్రాలయంలో తిక్కారెడ్డితో చర్చలు జరిపారు టీడీపీ నేతలు.. అయితే, తనకు అన్యాయం జరిగిందంటూ తిక్కారెడ్డి, ప్రభాకర్ మండిపడినట్టుగా తెలుస్తోంది.. మళ్లీ ఇవాళ కూడా కోడుమూరు టీడీపీ నేత ప్రభాకర్ ను బుజ్జగించేందుకు బీద రవిచంద్ర యాదవ్ టీమ్ వెళ్లగా.. ఆయన అందుబాటులో లేకపోవడంతో వెనుదిరాగాల్సి వచ్చింది.. అయితే, కోడుమూరు టికెట్‌ను అమ్ముకున్నారని బీదరవిచంద్రపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారట.. మరోవైపు.. ఆలూరు టికెట్ తనకివ్వలేదని, తనను కలసే ప్రయత్నం చేయొద్దన్ని బీద రవిచంద్ర యాదవ్‌కు కోట్ల సుజాతమ్మ స్పష్టం చేసినట్టుగా ప్రచారం సాగుతోంది. మరి, ఎన్నికల నాటికి అన్నీ సర్దుకుంటాయా? నేతలు రెబల్స్‌గానే బరిలోకి దిగుతారా? అనేది ఉత్కంఠగా మారిపోయింది.
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్‌కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!