TDP Leadership Training Conclave: టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం.. నేటి నుంచే వర్క్‌షాప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP Leadership Training Conclave: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న సమయంలో అన్ని రాజకీయ పార్టీలు లోకల్ బాడీ ఎలక్షన్స్‌పై ఫోకస్ పెడుతున్నారు.. అందులో భాగంగా.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి నేతలకు నేటి నుంచి రెండు రోజుల పాటు ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించనున్నారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ‘లీడర్షిప్ ట్రైనింగ్ కాంక్లేవ్’ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ నేతలకు నాయకత్వం, పార్టీ కార్యక్రమాల నిర్వహణపై దిశానిర్దేశం చేయడం ప్రధాన ఉద్దేశంగా ఈ కాంక్లేవ్‌ను ఏర్పాటు చేశారు.
కాంక్లేవ్‌ను ఇంటరాక్టివ్ విధానంలో నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేశ్, పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఎమ్మెల్యేల పనితీరు, నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాల అమలు, ప్రజలతో మరింత సమన్వయం వంటి అంశాలపై చర్చించనున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కాంక్లేవ్‌లో ప్రధాన అంశంగా ఉండనున్నాయి. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు, దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల సమాయత్తం, పార్టీ శ్రేణుల సమన్వయం, స్థానిక స్థాయిలో బలోపేతం వంటి అంశాలపై ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది. అలాగే ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం నిర్వహణపైనా నేతలతో చర్చించనున్నారు. రెండేళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో పార్టీ పనితీరును సమీక్షించడంతో పాటు, ప్రజల్లో పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు అవసరమైన కార్యాచరణపై అధిష్ఠానం దృష్టి సారించింది.
Also Read
- CM Chandrababu: ఎస్సీ, ఎస్టీల రక్షణకు ప్రత్యేక వ్యవస్థ.. ప్రొటెక్షన్ సెల్, విజిలెన్స్ కమిటీలు.. సీఎం కీలక సమీక్ష
- Perni Nani: స్పోర్ట్స్ కోటానే కాదు.. వికలాంగులు, ఓసీ, బీసీ కోటాల్లోనూ అక్రమాలు.. డీఎస్సీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
- AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
- CM Chandrababu: ఉద్యోగుల సమస్యలపై ఫోకస్.. నేడు 11 సంఘాలతో సీఎం భేటీ.. పీఆర్సీ, ఐఆర్, డీఏపై కీలక చర్చ..
తాజావార్తలు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
-
TDP Leadership Training Conclave: టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం.. నేటి నుంచే వర్క్‌షాప్
-
Bigg Boss Telugu 10: కింగ్ నాగార్జునకు కళ్లు చెదిరే రెమ్యునరేషన్.. బిగ్ బాస్ 10 కోసం ఎన్ని కోట్లంటే?
-
Miami Airport Plane Crash: మయామి విమానాశ్రయంలో ఘోర ప్రమాదం.. అమెజాన్ కార్గో బోయింగ్ 767 కూలి 5 మంది మృతి
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!