AP Fake Liquor Case: కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతలకు భారీ షాక్ తగిలింది.. జయచంద్రా రెడ్డి, సురేశ్ నాయుడులను టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు తాజాగా టీడీపీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు.. తాజాగా నకిలీ మద్యంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అన్నమయ్య జిల్లా మొలకల చెరువు నకిలీ మద్యం వ్యవహారంలో నిందితులపై కఠిన చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. నిస్పక్షపాతంగా దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని.. రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదని సీఎం తేల్చి చెప్పారు. ప్రజల ప్రాణాలకు హాని చేసే నకిలీ మద్యం విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
READ MORE: Eesha Rebba : సెగలు పుట్టించే సొగసులతో ఈషారెబ్బా రచ్చ
మరోవైపు.. ఏపీలో కల్తీ మద్యం అమ్మకాలపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు మద్యానికి బ్రాండ్ అంబాసిడర్గా మారారంటూ ఎక్స్ వేదికగా ఆరోపణలు చేశారు. నకిలీ లిక్కర్ వ్యవహారంలో రాష్ట్రాన్ని నంబర్ వన్ గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నట్టుకున్నారు చంద్రబాబు.. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో టీడీపీ నాయకులు ఏకంగా కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీయే పెట్టి సప్లై చేసిన ఘటన రాష్ట్రంలో మద్యం అక్రమాలకు నిదర్శనం.. రాష్ట్రానికి సంపద పెరగడం సంగతేమోగానీ, లిక్కర్ సిండికేట్లతో, నకిలీ మద్యం తయారీల ద్వారా ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టిన టీడీపీ నేతలు.. మీ పార్టీ నాయకులు అక్రమ సంపాదనను పైనుంచి కింది వరకూ పంచుకుంటున్నారు అని ఆరోపించారు. వ్యవస్థికృతంగా ఈ దందా కొనసాగుతోంది.. మీ లిక్కర్ సిండికేట్లకు, గ్రామస్థాయి వరకూ విస్తరించిన బెల్టు షాపుల మాఫియాలకు, కల్తీ మద్యం వ్యాపారానికి అడ్డు రాకూడదనే వ్యూహం ప్రకారం ప్రభుత్వ మద్యం దుకాణాలపై విష ప్రచారం చేశారని వైఎస్ జగన్ తెలిపారు.