Site icon NTV Telugu

TDP Members: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ని కలిసిన టీడీపీ నేతల బృందం

Ap Governoer

Ap Governoer

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను టీడీపీ నేతల బృందం కలిసింది. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు అరెస్ట్ అంశంతో పాటు రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలను గవర్నరుకు తెలుగు తమ్ముళ్లు వివరించారు. 17Aపై కీలక వాదనలు జరిగిన క్రమంలో గవర్నరుతో టీడీపీ భేటీ కీలక పరిణామమనే చర్చ జరగుతుంది. చంద్రబాబు కేసులపై గవర్నర్ ఇప్పటికే ఆరా తీశారనే ప్రచారం కొనసాగుతుంది. 17A నిబంధనను ప్రభుత్వం గాలికి వదిలేసిందనే అంశాన్ని గవర్నరుకు టీడీపీ శ్రేణులు వివరించారు. చంద్రబాబుపై పెట్టిన కేసులేంటీ..? అందులోని వాస్తవాలేంటి..? అనే అంశాన్ని టీడీపీ నేతలు తెలిపారు.

Read Also: Malala Yousafzai: పాలస్తీనా కోసం రూ.2.5 కోట్ల విరాళం ప్రకటించిన మలాలా యూసఫ్‌జాయ్..

స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసు, ఫైబర్ నెట్ కేసు, అమరావతి ఇన్నర్ రింగు రోడ్డు అలైన్మెంట్ మార్పు కేసుల్లో టీడీపీ వేసిన పుస్తకాలను గవర్నరుకు తెలుగు దేశం పార్టీ నేతలు సమర్పించారు. అయితే, గవర్నరుని కలిసిన వారిలో ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య, గద్దె రామ్మోహన్, బోండా ఉమాలు ఉన్నారు. అయితే, చంద్రబాబు అక్రమ అరెస్ట్‌, టీడీపీ నాయకుల గృహ నిర్బంధం లాంటి అనేక అంశాలను ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ దృష్టికి టీడీపీ నేతలు తీసుకు వెళ్లారు.

Exit mobile version