YSRCP: కృష్ణా జిల్లాలోని గుడివాడలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీగా మైనార్టీలు చేరారు. ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో , వైయస్ఆర్సీపీలో 500 మంది టీడీపీకి మైనార్టీలు జాయిన్ అయ్యారు. సీనియర్ టీడీపీ నాయకుడు మహమ్మద్ ఖాసిం అబూ నాయకత్వంలో పలువురు మాజీ కౌన్సిలర్లు, టీడీపీ నేతలు వైసీపీలో చేరారు.
Read Also: Bharatanatyam: పురాతన నృత్య రూపం భరతనాట్యం గురించి తెలుసా?
బీసీలకు, మైనార్టీలకు పెద్ద పీట వేసే ప్రభుత్వం వైసీపీది అని ఎమ్మెల్యే కొడాలి నాని పేర్కొన్నారు. పేదల ఇళ్ల స్థలాల కోసం ఒక్క ఎకరా సేకరించని చంద్రబాబుతో మాతో పోలికేంటి అంటూ ప్రశ్నించారు. పవన్‌ను చూస్తే జాలేస్తుందన్నారు. వెన్ను పోటుకు బ్రాండ్ అంబాసిడర్ అయిన నాదెండ్ల, చంద్రబాబును వెంటేసుకుని తిరుగుతున్నాడన్నారు. కోట్లాదిమంది పేద వర్గాలకు కుల మతాలకతీతంగా మేలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం వైసీపీదేనని ఆయన పేర్కొన్నారు.గుడివాడలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. కొత్తగా వచ్చిన ఎన్‌ఆర్ఐ నాయకులు చేసేదేం ఉందని ఎద్దేవా చేశారు.