గుంటూరు టీడీపీలో లెక్క చిక్కులకు దారి తీసింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ, జనసేన ప్రకటించిన 12 స్థానాలు ఒక లెక్క ఉంటే.. ప్రకటించాల్సిన ఐదు స్థానాలు మరో లెక్కగా ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా వర్గ పోరు, ఆశావాహుల లిస్టు పెద్ద ఎత్తున ఉన్న నియోజకవర్గాల అభ్యర్థుల లిస్టును పెండింగ్ లో పెట్టింది టీడీపీ అధిష్టానం. ఈ నేపథ్యంలో.. ఆచితూచి అడుగులు వేస్తోంది టీడీపీ. పలనాడు జిల్లాలోని కీలక నేత యరపతినేని శ్రీనివాసరావు కు సీటును మొదటి లిస్టులో ప్రకటించకపోవడంతో పలనాడులో తీవ్ర చర్చకు దారితీసింది. యరపతినేనికి సీటు ఇస్తారా లేదా అంటూ చర్చ మొదలైంది. అంతేకాకుండా.. గురజాల నియోజకవర్గంలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితులు, పల్నాడు జిల్లా కేంద్రంలో టీడీపీ గెలిచి తీరాలన ఆలోచనతో యరపతినేనికి స్థాన బదిలీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. యరపతినేనిని నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేపిస్తారని వార్తలు గుప్పుమన్నాయి. అందుకే గురజాల, నరసరావుపేట నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల లిస్టును టీడీపీ ప్రకటించలేకపోయిందని భావిస్తున్నారు టీడీపీ సీనియర్లు… ఇక గురజాల నియోజకవర్గంలో వైసీపీ నుండి టీడీపీలో చేరబోతున్న జంగా కృష్ణమూర్తికి అవకాశం ఇస్తారా లేదా అన్న సందిగ్ధత నెలకొంది.
Botsa Satyanarayana : విజయనగరంలో పర్యటించనున్న మంత్రి బొత్స సత్యనారాయణ
పెదకూరపాడులో రెండుసార్లు గెలిచిన మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ కు ఈసారి మొదటి లిస్టులో సీటు దక్కలేదు. అయితే.. ఈ నేపథ్ంయలో కొమ్మాలపాటి కి సీటు లేదని ప్రచారం తెర పైకి వచ్చింది. ఇక్కడి నుండి టీడీపీ ఒక యువ నాయకుడిని ఎన్నికల బరిలోకి దింపే అవకాశం ఉందని తెలుస్తోంది… అయితే స్థానిక ఎమ్మెల్యేకి సమీప బంధువు కావడం స్థానిక టీడీపీ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటంతో.. ఈ నేపథ్యంలోనే పెదకూరపాడు టికెట్‌ను అధిష్టానం పెండింగ్ పెట్టింది అన్న ప్రచారం జరుగుతోంది. ఇక గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఆశావాహుల లిస్టు ఉంది. దీంతో.. స్థానికంగా బలమైన నాయకులు దొరకపోవడం, బీసీ సామాజిక వర్గానికి ఇక్కడ సీటు కేటాయించాలన్న ఆలోచనలో అధిష్టానం ఉండడంతో గుంటూరు పశ్చిమలో పరిస్థితి క్లారిటీ లేదు. గుంటూరు తూర్పులో ముస్లిం వర్గంలో మహిళకు చోటు ఇవ్వాలన్న ఆలోచన లో టీడీపీ ఉన్నట్లు సమాచారం. ఇక రెండవ లిస్టు వచ్చేవరకు ఇంచార్జ్‌లకు టెన్షన్ తప్పేటట్లు లేదు.
Guntur : చేతబడి అనుమానం.. రైతు దారుణ హత్య