చిత్తూరు జిల్లాలో ఎన్నికలకు ముందే రాజకీయం వేడెక్కింది. మంత్రి రోజాపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు పుత్తూరు టీడీపీ ఇన్ ఛార్జ్ గాలి భానుప్రకాష్. పుత్తూరు నియోజకవర్గంలో పాదయాత్రకు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు. తమిళనాడు రాష్ట్రం నుంచి ప్రజలను పాదయాత్రకు తీసుకురాలేదు. లోకేష్ కు సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. నా ఆస్తులపై సిబిఐ విచారణ చేయమని మంత్రి రోజా చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రోజాకు ధైర్యం ఉంటే తన ఆస్తులపై సిబిఐ విచారణ విచారణ కోరాలన్నారు భాను ప్రకాష్.
Read Also: Ishant Sharma: షమీపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు..ఇషాంత్ ఏమన్నాడంటే!
లేకుంటే టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే రోజా ఆస్తులపై సిబిఐ విచారణ చేయిస్తాం. రోజా నిత్య పెళ్ళికూతురు..రోజా చరిత్ర అందరికీ తెలుసు. రోజా ఫ్యామిలీ మన్నార్ గుడి మాఫియాగా పెట్రేగిపోయింది… కువైట్, దుబాయ్ లలో రోజాకు పనేంటి..? పర్యాటకశాఖను ఏ మాత్రం అభివృద్ధి చేయలేదు. మహిళలు తలవంచుకునేలా రోజా వ్యవహారశైలి ఉంది. నగరి నియోజకవర్గంలో రోజా చేస్తున్న అవినీతికి అడ్డూఅదుపూ లేకుండా పోయింది. ఎమ్మెల్యేకు వాటా లేనిదే నగరి నియోజకవర్గంలో ఏ ఒక్క పని ప్రారంభం కాదు. భూకబ్జా, మట్టిమాఫియా, గ్రావెల్ మాఫియా మొత్తం రోజా కనుసన్నల్లోనే జరుగుతోందని భాను ప్రకాష్ ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో మంత్రి రోజా నగరిలో ఓడిపోవడం ఖాయం అని జోస్యం చెప్పారు.
Read Also: Depression: డిప్రెషన్ పెరిగితే ఇలా చేయండి.. తప్పకుండా రిలీఫ్ దొరుకుతుంది
