టీమిండియాకు ప్రస్తుతం కీలక పేసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు మహ్మద్ షమీ. తాజాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులోనూ మంచి పెర్ఫామెన్స్ ఇచ్చాడు. కాగా, షమీ తన క్రికెట్ కెరీర్‌తో పాటు తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా 2018లో షమీపై అతడి మాజీ భార్య హసీన్ జహాన్ గృహ హింస కేసుతో పాటు అతడు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడంటూ ఆమె తీవ్రమైన ఆరోపణలు చేసింది. దీంతో బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం దర్యాప్తు కూడా చేపట్టింది. అయితే ఆరోపణలు అవాస్తమని యాంటీ కరప్షన్ విభాగం కొట్టపారేసింది. తాజాగా ఇదే విషయంపై భారత వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ ఆసక్తికర వాఖ్యలు చేశాడు.
Also Read: Pakistan: లీటరు పాలు రూ.270, కేజీ చికెన్ రూ.800.. ఏంటీ ధరలు
“షమీ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల గురించి అవినీతి నిరోధక విభాగం హెడ్ నీరజ్ కుమార్ మా జట్టు సభ్యులందరినీ విచారించారు. పోలీసులు అడిగినట్లే అన్ని విషయాలు మా దగ్గర తెలుసుకున్నారు.అదే విధంగా షమీ వ్యక్తిగత విషయాల గురించి నన్ను ప్రశ్నించారు. అయితే అతడి వ్యక్తిగత విషయాలు గురించి నాకు తెలియదు అని బదులు ఇచ్చాను. కానీ నా వరకు అయితే షమీ 200 శాతం అలాంటి పని చేయడని చెప్పాను. ఈ విచారణ తర్వాత షమీతో నా అనుబంధం మరింత బలపడింది” అని ఇషాంత్ పేర్కొన్నాడు.
Also Read: WPL 2023: ఢిల్లీ టీమ్‌కు షెఫాలీ.. మరి అప్పట్లో కోహ్లీని ఎందుకు తీసుకోలే!