NTV Telugu Site icon

Kuna Ravi: తమ్మినేని కామెంట్లపై కూన రవి ఫైర్

Kuna Ravi

Kuna Ravi

ఏపీలో టీడీపీ-వైసీపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. అందునా శ్రీకాకుళం జిల్లాలో బంధువుల మధ్యే రాజకీయ వైరం ముదురుతోంది. టీడీపీ నేత కూనరవి- స్పీకర్ తమ్మినేని మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. టీడీపీపై స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు కూన రవి. తల్లి పాలు తాగి రొమ్ముగుద్దే రకం తమ్మినేని. తమ్మినేనిని ఆముదాల వలసలో సజీవంగా దహనం చేస్తారు.

తమ్మినేని పాడె మోయడానికి కూడా ఎవరు ఉండరని ఘాటైన విమర్శలు చేశారు కూన రవి. టీడీపీకి రోజులు దగ్గర పడ్డాయన్న వారికే రోజులు దగ్గరపడ్డాయి. ఒకరిద్దరికి మంత్రి పదవులిచ్చినంత మాత్రాన ఒరిగేదేం లేదు. వైసీపీని పడగొట్టడానికి రెడీగా ఉన్నారు. తన చితికి తానే వైసీపీ నిప్పు పెట్టుకుంటోందన్నారు కూన రవి. వైసీపీ సామాజిక న్యాయ భేరీ బస్సు యాత్రలో భాగంగా స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో సంతృప్తికర పాలన కొనసాగుతోందన్నారు. మళ్లీ సీఎం జగన్‌ను గెలిపిస్తామని ప్రజలు అంటున్నారని అన్నారు.

టీడీపీ నిర్వహిస్తున్న మహానాడుపైన విమర్శలు చేశారు తమ్మినేని. రాష్ట్రంలో సామాజిక న్యాయం చేస్తుంటే కొన్ని ప్రతిపక్ష పార్టీలు అల్లర్లకు పాల్పడుతున్నాయంటూ మండిపడ్డారు. మహానాడు కాదు వల్లకాడు అంటూ తమ్మినేని నిప్పులు చెరిగారు. అమలాపురంలో దళిత మంత్రి ఇంటికి నిప్పు పెట్టడం అమానుషమన్నారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని సమర్ధిస్తారా లేదా ప్రతిపక్ష పార్టీలు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేసారు.

రాష్ట్రంలో టీడీపీ పని అయిపోయిందని, రాబోయే ఎన్నికలనాటికి టీడీపీ కనిపించకుండా పోతుందని తమ్మినేని పేర్కొన్నారు. చచ్చిన పార్టీకి ప్రజలు దహన సంస్కారాలు చేస్తున్నారని.. జగన్మోహన రథచక్రాల కింద విపక్షాలు నలిగిపోతున్నాయని తమ్మినేని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బలహీన వర్గాలకు సీఎం జగన్ పెద్దపీట వేశారని..స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యలపై కూన రవి, వర్ల రామయ్య తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. స్పీకర్ తమ్మినేని సీతారామ్‌కు మతిభ్రమించిందని.. అందుకే మహానాడును వల్లకాడుతో పోలుస్తున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య పేర్కొన్నారు. పసుపు కండువా కప్పుకొనే చస్తానని ప్రగల్బాలు పలికి.. నయ వంచకుడి పక్కన చేరి పిచ్చిగా మాట్లాడడం సరికాదని వర్ల రామయ్య హితవు పలికారు.

Tammineni Sitaram: టీడీపీ చేసేది మహానాడు కాదు.. వల్లకాడు

Show comments