Site icon NTV Telugu

TDP-Janasena: తాడేపల్లిగూడెం వేదికగా టీడీపీ-జనసేన ఉమ్మడి సభ..

Tdp Janasena

Tdp Janasena

టీడీపీ-జనసేన ఉమ్మడిగా నిర్వహించబోతున్న తొలి సభకు తాడేపల్లిగూడెం వేదికగా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 6 లక్షల మంది ఈసభకు హజరవుతారనే అంచనాతో సభా ప్రాంగణాన్ని ఇరు పార్టీలు కలసి ముస్తాబు చేస్తున్నాయి. బుధవారం జరగబోయే సభకు తెలుగుజన విజయ కేతనం జెండా అనే పేరు పెట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు వేదికపై నుంచి నాయకులకు, క్యాడర్కు దిశానిర్ధేశం చేయబోతున్నారు.

BC Janardhan Reddy: కాటసాని రామిరెడ్డికి భారీ షాక్.. సైకిలెక్కిన ఎర్రబోతుల వర్గీయులు..!

టీడీపీ-జనసేన ఉమ్మడిగా నిర్వహించబోతున్న జెండా సభకు భారీ ఏర్పాట్లు చేసేపనిలో నిమగ్నమయ్యారు ఇరుపార్టీల నేతలు. తాడేపల్లిగూడెం వేదికగా నిర్వహించబోతున్న ఈసభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటు మరో 500 మంది నాయకులు వేదికను పంచుకోబోతున్నారు. అన్ని నియోజకవర్గాల నుంచి దాదాపు 6 లక్షల మంది జనం ఈసభకు హజరవుతారని అంచనా. సభా ప్రాంగణం చుట్టు భారీ ఎల్ఈడీలు, ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల శంఖారావాన్ని ఇరు పార్టీల అధినేతలు ఇదే వేదికపై నుంచి పూరించబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడిగా విజయం సాధించడమే లక్ష్యంగా క్యాడర్ ఏవిధంగా పనిచేయాలి.. టిక్కెట్ల కేటాయింపు తర్వాత ఇరు పార్టీల ఎలాంటి విభేదాలు లేకుండా పనిచేయాలనే విధంగా అధినేతలు క్యాడర్‌కు దిశానిర్ధేశం చేయబోతున్నారు.

Antony Review: కళ్యాణి ప్రియదర్శన్- ఆంటోనీ రివ్యూ

పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలిరానున్న నేపద్యంలో భారీ పోలిస్ బందోబస్తు ఏర్పాటు చేసారు. దాదాపు వెయ్యి మంది పోలీసులు సభ సజావుగా సాగేవిధంగా రక్షణ చర్యలు తీసుకోనున్నారు. పవన్, చంద్రబాబుకు విడివిడిగా రెండు హెలిప్యాడ్‌లను సిద్ధం చేసారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి సభ మొదలు కానున్న నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవడంలో ఇరుపార్టీల నేతలు తలామునకలై ఉన్నారు. ఇప్పటికే ఉమ్మడి తొలిజాబితాను ప్రకటించడంతో కొతమంది టిక్కెట్లు రాని నాయకుల్లో అసంతృప్తి ఉండిపోయింది. ఆయా నాయకులకు సంబంధించిన అనుచర వర్గాలు జెండా సభకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. మరికొంత మంది ఆశావాహులు సభను విజయవంతం చేసేందుకు భారీ జనసమీకరణపై దృష్టిపెట్టారు. జాతీయ రహదారిని ఆనుకుని సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఉదయం నుంచి పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రానున్నాయి.

Exit mobile version