Site icon NTV Telugu

TDP-Janasena: తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన ఉమ్మడి భారీ బహిరంగ సభ ప్రారంభం

Tdp Janasena

Tdp Janasena

TDP-Janasena: తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన కలిసి ఉమ్మడిగా నిర్వహిస్తోన్న “తెలుగు జన విజయ కేతనం జెండా” సభ ప్రారంభమైంది. వేదికపైకి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లతో పాటు ఇరు పార్టీలకు చెందిన ఐదువందల మంది నాయకులు చేరుకున్నారు. మొదటి వరుసలో చంద్రబాబు, పవన్ తో పాటు బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణలు ఉన్నారు. వేదికపైకి కలిసి వచ్చిన చంద్రబాబు, పవన్‌లు కలిసి వచ్చి.. జెండాలు మార్చుకుని ప్రజలకు అభివాదం చేశారు.

Read Also: Vijayasai Reddy: వైసీపీలో ఆత్మగౌరవ సమస్య అనేది రాదు.. అలా ఏ చర్యలు ఉండవు..

చంద్రబాబు జనసేన జెండా పట్టుకోగా.. పవన్‌కల్యాణ్ టీడీపీ జెండా పట్టుకున్నారు. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు, అభిమానులు సభకు భారీగా తరలివచ్చారు. సభా ప్రాంగణానికి 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. టీడీపీ-జనసేన కూటమి తరఫున తొలి జాబితను విడుద చేసిన తర్వాత నిర్వహిస్తున్న తొలి ఉమ్మడి సభ ఇదే కావడం గమనార్హం. మరికాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌లు నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు.

https://www.youtube.com/watch?v=t5y1SkpPOjU

 

Exit mobile version