ఏపీలో తాజాగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం జరుగుతోందని, చర్యలు తీసుకోవాలని టీడీపీ ఫిర్యాదుచేసింది. అమరావతిలోని సచివాలయంలో ఎన్నికల సంఘాన్ని కలిసింది టీడీపీ బృందం. ఏపీలో జరగనున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ అవకతవకలకు పాల్పడుతోందని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది టీడీపీ. అధికార పార్టీ ఓటర్లను ప్రలోభ పెట్టడంతో పాటు ఓట్లనే తారుమారు చేస్తుందని ఫిర్యాదు చేసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిశారు మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజా, ఎమ్మెల్సీ అశోక్ బాబు.
Read Also: CM KCR: మళ్ళీ వస్తా… ఆలయ అభివృద్ధి, విస్తరణపై సమీక్ష నిర్వహిస్తా
నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అవకతవకలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. అధికార పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాలకు గురిచేసేందుకే ఎమ్మెల్సీ కల్పన రెడ్డి భర్త ప్రతాప్ రెడ్డిని విద్యాశాఖ కడప ఆర్జేడీగా ప్రభుత్వం నియామకం చేసింది. కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా అధికార దుర్వినియోగానికి పాల్పడి తన భార్య కల్పనా రెడ్డిని.. ప్రతాప్ రెడ్డి గెలిపించుకున్నాడు. ఇదే విధానాన్ని పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రతాప్ రెడ్డిని వాడుకుంటోంది.
ఫిర్యాదుపై ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందిస్తుందని నమ్మకం ఉంది. ప్రతాప్ రెడ్డిని విద్యాశాఖ కడప ఆర్జేడీగా విధుల నుంచి తొలగించాలని ఎన్నికల ప్రధాన అధికారి మీనాను కోరాం. తిరుపతి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనర్హులను ఓటర్లుగా నమోదు చేశారు. ఇదే అంశాన్ని గతంలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకున్నారని ఎన్నికల సంఘాన్ని అడిగాం. ఓసారి సమీక్షించామని మళ్లీ సమీక్షించి చర్యలు తీసుకుంటామని మీనా తెలిపారు.
Read Also: Prattipadu TDP:ప్రత్తిపాడు టీడీపీలో విభేదాలు… ఏలేశ్వరంలో ఆందోళన
