Chandrababu: రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ప్రజాగళంకు భారీ స్పందన వస్తోందని.. వచ్చే 39రోజుల్లో జోరు పెరగాలి, ఫ్యాన్ తుక్కు తుక్కు కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల ప్రజాగళం సభలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో దొంగలు పడ్డారు.. బందిపోట్లు పడ్డారు.. వారందరికీ నాయకుడు జగన్ అంటూ విమర్శించారు. ఇప్పటివరకు ఏ ఒక్క సీఎంను సైకో అనలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో రెండు బటన్లు నొక్కాలి.. ఒకటి సైకిల్ గుర్తుపై, రెండోది కమలంపై నొక్కి, ఉత్తుత్తి బటన్లను నొక్కేవారిని ఇంటికి పంపాలన్నారు. దేశంలో అతి పెద్ద ప్రాజెక్ట్ పోలవరం, ఎలాంటి ప్రాజెక్ట్ ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రాజెక్ట్ ప్రాధాన్యత గుర్తించి ఏడు మండలాలు తెలంగాణ నుంచి ఆంధ్రలో విలీనం చేసిన తర్వాతే 2104లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశామన్నారు. 414 రోజుల్లో డయాఫ్రమ్ వాల్ పూర్తి చేసి ప్రాజెక్ట్ 72శాతం పనులు పూర్తి చేసిన ఘనత టీడీపీదేనని చంద్రబాబు పేర్కొన్నారు. పోలవరం పూర్తి చేస్తానన్న ముఖ్యమంత్రి సర్వనాశనం చేశారని ఆరోపించారు.
Read Also: Andhra Pradesh: చంద్రబాబుకు ఎన్నికల సంఘం నోటీసులు
ఎస్సీల కోసం 23పథకాలు తీసుకు వస్తే వాటిని అమలు చేయకుండా నా ఎస్సీలు అంటూ ముఖ్యమంత్రి మోసం చేస్తున్నారన్నారు. ఎస్సీ విద్యార్థుల కోసం ఎన్నో పథకాలు జగన్ తీసేశారని చంద్రబాబు అన్నారు. ఎస్సీ యువతకి ఉపాధి కల్పించేందుకు కార్లు ఇస్తే ఆ పథకాన్ని కూడా తీసేశారని విమర్శలు గుప్పించారు. 32మంది పెన్షన్లు తీసుకునే వాళ్ళు చనిపోతే సంతోషంగా సీఎం ఉన్నారని ఆయన ఆరోపణలు చేశారు. వాలంటీర్లు ఉండాలి, ప్రజలకు సేవ చేస్తే సరే.. వైసీపీకి ఊడిగం చేస్తే సహించేది లేదన్నారు. తాను సీఎంగా ఉంటే ఇంటిదగ్గర డబ్బులు వచ్చేలా చేసే వాడినన్నారు.32మంది చనిపోయారు అంటున్నారు.. అవన్నీ ప్రభుత్వ హత్యలే అంటూ ఆరోపించారు. 2వందల నుంచి రెండువేల పెన్షన్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదని ఆయన చెప్పారు. అన్న క్యాంటీన్లు ఉంటే మూడు పూటలా పేదల కడుపు నిండేదన్నారు. వైసీపీ డీఎన్‌ఏలో శవరాజకీయాలు ఉన్నాయని.. టీడీపీ డీఎన్‌ఏలో సేవా రాజకీయాలు ఉన్నాయన్నారు.ఈ నెల నుంచే 4వేలు పెన్షన్ ఇస్తాము అంటే వైసీపీ వాళ్ళకి ప్యాంట్లు తడిసి పోయాయన్నారు. 10రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేసిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. నా వయసు గురించి జగన్ మాట్లాడుతున్నారు.. నాతో రెండు రోజులు కలిసి తిరిగితే తెలుస్తుందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.