నేడు మార్చి 28 తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో పర్యటన చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నేడు రాప్తాడు, బుక్కరాయసముద్రం, కదిరి ప్రాంతాలలో ప్రజాగళం పేరిటన ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభల్లో ఆయన ప్రసంగం చేయబోతున్నారు. ఇందులో భాగంగా ఉదయం 10 గంటలకు మదనపల్లి బీటీ కళాశాల మైదానం నుంచి హెలికాప్టర్ లో బయలుదేరనున్నారు. ఆపై 10:45 నిమిషాలకు గాను ప్రసన్ననాయపల్లి అయ్యప్ప స్వామి దేవాలయం దగ్గర హెలికాప్టర్ దిగి రోడ్డు మార్గం గుండా 11 గంటలకు రాప్తాడు బస్టాండ్ కు చేరుకోనున్నారు. అక్కడే 12:30 కు బహిరంగ సభలో ఆయన పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత 2:00 వరకు విశ్రాంతి తీసుకుంటారు.
Also read: Memantha Siddham: నేడు నంద్యాలలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
ఇక మధ్యాహ్న భోజనం తర్వాత 02:00 నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 02:30 గంటలకు బుక్కరాయసముద్రం సబ్ స్టేషన్ సెంటర్ కు చేరుకుంటారు. అక్కడ 02:30 నుండి 04:00 వరకు బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొనబోతున్నారు. ఆ సభ తర్వాత 5:10 నిమిషాలకు ప్రసన్నాయపల్లి నుండి హెలికాప్టర్ లో బయలుదేరి శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని ఎస్టీఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దిగుతారు.
Also read: Congress MP List: మరో నాలుగు స్థానాలకు అభ్యర్థుల ప్రకటించిన కాంగ్రెస్..!
ఆ తర్వాత నగరంలోని మహిళా కళాశాల కుడలిలో 05:50 నిమిషాల నుంచి 7:30 వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత ఆయన మళ్ళీ తిరిగి మదనపల్లికి చేరుకోనున్నారు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు నేటి పర్యటనలో భాగంగా మూడు సభలలో ప్రసంగనించనున్నారు.