Site icon NTV Telugu

Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై టీడీపీ శ్రేణుల దాడి.. నివాసానికి నిప్పు

Jogi Ramesh

Jogi Ramesh

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు రాష్ట్రంలో పెనుదుమారం రేపాయి. చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలతో టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. నిన్న అంబటి ఇంటిపై దాడి చేశాయి. ఆరోపణలపై అందిన ఫిర్యాదు మేరకు గుంటూరులో ఆయన నివాసం వద్ద పోలీసులు అంబటి రాంబాబును అరెస్ట్ చేశారు. కాగా ఈ వ్యవహారం మరింత ముదురుతోంది.

Also Read:Organs: మానవునిలోని 80 అవయవాలలో 5 మాత్రమే ముఖ్యమైనవి.. మిగిలిన 75 అవయవాలు లేకపోయినా శ్వాస ఆగదట!

తాజాగా మంత్రి లోకేష్ పై చేసిన అనుచిత వ్యాఖ్యాల పై జోగి రమేష్ ఇంటిని టీడీపీ శ్రేణులు ముట్టడించాయి. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై టీడీపీ శ్రేణుల దాడికి పాల్పడ్డాయి. ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటికి చేరుకున్న టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. పోలీసుల ముందే టీడీపీ శ్రేణులు జోగి ఇంటికి నిప్పంటించారు. జోగి నివాసంలోనే ఉన్న జోగి రమేష్ తండ్రి, జోగి భార్య.. తంబళ్ల పల్లె లో జోగి రమేశ్ ఉన్నట్లు సమాచారం.

Exit mobile version