NTV Telugu Site icon

Namburu Sankara Rao: వైసీపీలోకి భారీగా చేరికలు.. పార్టీలోకి ఆహ్వానించిన నంబూరు..

Namburu

Namburu

పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ జోరుమీదుంది. ఎన్నికల ప్రచారంలో జెట్ స్పీడ్ తో దూసుకెళ్తోంది. దానికి తోడు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో భారీ సంఖ్యలో టీడీపీ, జనసేనతో పాటు ఎంఐఎం లాంటి పార్టీల నుంచి కూడా కార్యకర్తలు.. వైసీపీలో చేరుతున్నారు. ఇవాళ ఒక్కరోజే నియోజకవర్గంలోని సుమారు 20 గ్రామాల నుంచి 500కు పైగా కుటుంబాలు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. వారిలో పెదకూరపాడు, హుస్సేన్ నగర్, బెల్లంకొండ, వెంకటాయపాలెం, అమరావతి, మునగోడు, అచ్చంపేట, వేల్పూరు, కస్తల మండలాలకు చెందిన 20 కుటుంబాలు టీడీపీని వదిలి పెట్టి వైసీపీలో చేరారు.

Read Also: ICSE 10th class results 2024 : ఐసీఎస్ఈ 10వ తరగతి, ఐఎస్సీ పరీక్షా ఫలితాలు విడుదల

అలాగే, మాదిపాడు, బెల్లంకొండ మండలంలోని నందిరాజుపాలెం, క్రోసూరు మండలంలోని ఊటుకూరు, క్రోసూరు, అచ్చంపేట మండలం తాళ్లచెరువు, క్రోసూరు మండలంలోని ఎర్రబాలె గ్రామాల నుంచి 10 కుటుంబాల చొప్పున టీడీపీ, జనసేన, ఎంఐఎం పార్టీల నుంచి కూడా వైసీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో జగనన్న పార్టీ జెండా ఎగరేద్దామని ఎమ్మెల్యే నంబూరు శంకరరావు వారికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా క్రోసూరు మండలం ఆవులవారిపాలెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారాయాన.. గ్రామస్తులు బాణాసంచా కాల్చి పూలతో ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంబూరి శంకరరావు ర్యాలీలో పాల్గొన్నారు.

Read Also: CM YS Jagan: బాబు చరిత్ర చెప్పే సత్యం ఇది..! గుర్తుపెట్టుకుని ఓటు వేయాలి…

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో తన వంతు కృషి చేశానన్నారు. గత 30 ఏళ్లలో ఎవరూ చేయలేని అభివృద్ధి తాను చేసి చూపించానన్నారు. ఈ ఐదేళ్లలో కలలో కూడా ఎవరు ఊహించని అభివృద్ధి చేశానన్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు తాము ఏం చేశామో చెప్పే ధైర్యం తమకుందన్నారు. ఆ ధైర్యంతోనే ప్రతి ఇంటికి వెళ్లి ధైర్యంగా ఓటు అడగగలుగుతున్నామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేదల కోసం 125 సార్లు బటన్ నొక్కి సంక్షేమ పథకాలు అందించారు.. ప్రజలు కూడా కేవలం రెండుసార్లు బటన్ నొక్కి ఆయన రుణం తీర్చుకునే సమయం వచ్చిందన్నారు. ఒక ఓటు తనకు, మరో ఓటు ఎంపీ అభ్యర్ధి అనిల్ కుమార్ కి వేస్తే.. ఆ ఓట్లు జగనన్నకు వేసినట్టే అని పెదకూరపాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంబూరు శంకరరావు తెలిపారు.

Show comments