ICSE 10th class results 2024 : ఐసీఎస్ఈ 10వ తరగతి, ఐఎస్సీ పరీక్షా ఫలితాలు విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎస్ఈ 10వ తరగతి, ఐఎస్సీ (12వ తరగతి) పరీక్షా ఫలితాలను కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (సీఐఎస్సీఈ) విడుదల చేసింది. ఈ సంవత్సరం 2,43,617 మంది ఐసీఎస్ఈ క్లాస్ 10 పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 2,42,328 మంది ఉత్తీర్ణులయ్యారు. 99,901 మంది విద్యార్థులు ఐఎస్సీ క్లాస్ 12 పరీక్ష రాయగా.. అందులో 98,088 మంది ఉత్తీర్ణులయ్యారు. ఐసీఎస్ఈ పాస్ పర్సెంటేజ్ 99.47శాతం కాగా.. ఐఎస్సీ పాస్ పర్సెంటేజ్ 98.19శాతంగా నమోదైంది. ఐసీఎస్ఈ క్లాస్ 10 ఫలితాల్లో 99.65శాతం మంది బాలికలు పాలయ్యారు. 99.31శాతం మంది అబ్బాయిలు ఉత్తీర్ణులయ్యారు. ఇక ఐఎస్సీ క్లాస్ 12 ఫలితాలు 2024ల 98.92శాతం మంది అమ్మాయిలు, 97.53శాతం మంది అబ్బాయిలు పాస్ అయ్యారు. 10 క్లాస్, 12 క్లాస్ ఫలితాలను www.cisce.org అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవాలని సీఐఎస్సీఈ తెలిపింది. డిజీలాకర్‌లో ఫలితాలను https://results.digilocker.gov.in ద్వారా చూడొచ్చు.
READ MORE: Daksha Nagarkar : హాస్పిటల్లో చేరిన హీరోయిన్..కష్టంగా ఉందంటూ ఎమోషనల్ పోస్ట్..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
విద్యార్థులకు రీ-చెకింగ్, రీ- ఇవాల్యుయేషన్ వెసులుబాటును కల్పిస్తున్నట్లు సీఐఎస్సీఈ ప్రకటించింది. ఒక్కో సబ్జెక్ట్ కి రీ-చెకింగ్‌కి రూ. 1000, రీ- ఇవాల్యుయేషన్కి రూ. 1,500 చెల్లించాలని సూచించింది. ఈ ఏడాది ఐసీఎస్ఈ పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 21 నుంచి మార్చ్ 28 వరకు, ఐఎస్సీ (12వ తరగతి) పరీక్షలు ఫిబ్రవరి 12 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగాయి. ఫిబ్రవరి 26న జరగాల్సిన 12వ తరగతి కెమిస్ట్రీ పరీక్షను రీషెడ్యూల్ చేసి మార్చ్ 21న నిర్వహించారు. ఇప్పటికే ఐసీఎస్ఈ, ఐఎస్సీ కంపార్ట్మెంట్ పరీక్షలను డిస్కంటిన్యూ చేసిన విషయం తెలిసిందే.. ఇప్పుడు విద్యార్థులు, గరిష్ఠంగా రెండు సబ్జెక్ట్స్ లో ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం సీఐఎస్సీఈ వెబ్‌సైట్‌ని సందర్శించాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!