Philander : ఓ ట్యాక్సీ డ్రైవర్‌కు వివాహితతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత పరిచయం కాస్తా స్నేహంగా మారింది. స్నేహం తర్వాత ఇద్దరి మధ్య అనైతిక సంబంధం ఏర్పడింది. కానీ ఈ బంధం ఆ మహిళ జీవితానికే చేటు తెచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో ముగ్గురు పిల్లల తల్లిని ట్యాక్సీ డ్రైవర్ హత్య చేశాడు. ఆ ట్యాక్సీ డ్రైవర్ మహిళను తన భర్త, ముగ్గురు పిల్లలను వదిలి అతనితో రావాలని బలవంతం చేశాడు. దీనికి ఆమె నిరాకరించడంతో మహిళను ట్యాక్సీ డ్రైవర్ దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో నిందితుడు ట్యాక్సీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Ambulance : అంబులెన్స్‌కు దారి ఇవ్వకపోతే భారీ ఫైన్.. పోలీసులుండరు.. అంతా ఆటోమేటిక్
నిందితుడి పేరు శివశంకర్ ముఖియా. అతడికి పెళ్లయి నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. శివశంకర్ కు, బాధితురాలు మూడేళ్ల క్రితం ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమయ్యారు. పరిచయం తర్వాత ట్యాక్సీ డ్రైవర్ ఆమెకు ఆర్థికంగా చాలాసార్లు అండగా నిలబడ్డాడు. దీన్ని ఆసరాగా చేసుకుని శివశంకర్ ఆమెను తనతో వచ్చేయమని కోరాడు. కానీ ఆమె తన భర్తను విడిచిపెట్టడానికి సిద్ధంగా లేనని తేల్చి చెప్పింది. బాధితురాలు తన భర్త, పిల్లలతో కలిసి నివసిస్తోంది. కుటుంబ పోషణ కోసం ఆమె భర్త కూలి పని చేసేవాడు. నిందితుడు గత కొన్ని నెలలుగా పెళ్లి కోసం మహిళను వేధిస్తుండేవాడు. తన భర్తను విడిచిపెట్టమని చాలాసార్లు అడిగాడు. అయితే ఆ మహిళ తన భర్తను, ముగ్గురు పిల్లలను వదిలి అతని వద్దకు రావడానికి నిరాకరించింది. దీంతో కోపోద్రిక్తుడైన శివశంకర్ మొదట ఆ ప్రాంతంలో మహిళపై అసభ్యకరమైన పోస్టర్లు అంటించాడు.
Read Also:Manda Krishna Madiga: కడప పోలీసుల నిరక్ష్యం వల్లే అది జరిగింది
ఆ తర్వాత నిందితుడు మహిళను ఆమె ఇంట్లోనే హత్య చేశాడు. మహిళ భర్త ఇంటికి వచ్చిన తర్వాత భార్య మృతదేహాన్ని చూశాడు. అనంతరం ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదికలో మహిళ తల, నోటిపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం ఆ ప్రాంతంలోని సీసీటీవీ, మహిళ ఫోన్ రికార్డులను పరిశీలించిన పోలీసులు నిందితుడి గురించిన సమాచారాన్ని రాబట్టారు. దక్షిణ ఢిల్లీలోని చిరాగ్ ఢిల్లీ ప్రాంతం నుంచి పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. పోలీసులు వారి స్టైల్లో విచారించగా శివశంకర్ నేరం అంగీకరించాడు.
