Casino Chain Delta Corp: రూ. 11,139 కోట్ల పన్ను చెల్లించాలని కాసినో చైన్ డెల్టా కార్ప్‌కు నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Casino Chain Delta Corp: భారతదేశపు అతిపెద్ద క్యాసినో చైన్ డెల్టా క్రాప్ సెప్టెంబరు 22న స్టాక్ ఎక్స్ఛేంజీలకు రూ.11,139 కోట్ల జీఎస్టీ నోటీసు అందిందని తెలియజేసింది. హైదరాబాద్‌లోని జీఎస్టీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ ఈ నోటీసును పంపారు. జూలై 2017 నుండి మార్చి 2022 వరకు వడ్డీ, జరిమానాతో కలిపి రూ. 11,139 కోట్ల పన్ను చెల్లించాలని నోటీసులో పేర్కొంది. షోకాజ్ నోటీసు ఇచ్చినట్లు శుక్రవారం స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో కంపెనీ తెలిపింది.
Read Also:Gurukula School:షేక్ పేట్ గురుకుల పాఠశాలలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
క్యాసినోలో ఆడే అన్ని ఆటల స్థూల ఆధారిత విలువపై పన్ను మొత్తం ఆధారపడి ఉంటుందని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. స్థూల గేమింగ్ రాబడిపై కాకుండా స్థూల పందెం విలువపై జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది. ఈ సమస్యకు సంబంధించి పరిశ్రమ స్థాయిలో ప్రభుత్వానికి ఇప్పటికే కొన్ని నివేదికలు జారీ చేయబడ్డాయి. తమకు అందిన సమాచారం ప్రకారం ఈ నోటీసు ఏకపక్షమని, చట్ట వ్యతిరేకమని కంపెనీ కూడా చెబుతోంది. ఈ పన్ను డిమాండ్‌ను చట్టపరంగా సవాలు చేస్తామని కంపెనీ తెలిపింది.
Read Also:Maharastra: తండ్రి చనిపోయాడని… కూతురును బిల్డింగ్ పై నుంచి తోసేసి చంపిన తల్లి
ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ క్యాసినో, ఆన్లైన్ గేమింగ్, గుర్రపు పందాలపై 28 శాతం పన్నును కొనసాగించింది. పన్ను అక్టోబరు 1, 2023 నుండి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. అమలు తేదీ నుండి ఆరు నెలల తర్వాత పన్నును సమీక్షించడానికి కౌన్సిల్ మళ్లీ సమావేశమవుతుంది. మరోవైపు, గేమింగ్ కంపెనీలు కొత్త 28 శాతం జిఎస్టి పన్ను ప్రభావాన్ని అనుభవించడం ప్రారంభించాయి. గేమింగ్ యాప్ మొబైల్ ప్రీమియర్ లీగ్ గత నెలలో పన్నును తప్పించుకోవడానికి 350 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. జూలైలో ప్రభుత్వం కొత్తగా 28 శాతం జీఎస్టీని ప్రతిపాదించినప్పటి నుంచి డెల్టా కార్ప్ షేర్లు దాదాపు 29 శాతం పడిపోయాయి.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!