Gurukula School:షేక్ పేట్ గురుకుల పాఠశాలలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gurukula School: దేశంలో వినాయకచవితి ఉత్సవాలు ఘనంగ జరుగుతున్నాయి. వాడవాడలా వినాయ విగ్రహాలు వెలశాయి. ఈనెల 18 నుంచి వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గల్లీ గల్లీలో వినాయకుడిని పెట్టి పూజలు నిర్వహిస్తున్నారు. కొందరు పాఠశాల విద్యార్థులు వినాయక విగ్రహం పెట్టారు. అయితే వినాయక విగ్రహం వద్ద వున్న దీపం పాఠశాల విద్యార్థుల బెర్ సీట్ లకు అంటుకోవడంతో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయలయ్యయి. ఈ ఘటన ఫిలిం నగర్ పోలీస్టేషన్ పరిధిలోని షేక్ పేట్ గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది.
షేక్ పేట్ గురుకుల పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగింది. వినాయక చవితి కావడంతో విద్యార్థులు చెందా వేసుకుని హాస్టల్ గదిలో వినాయకుడిని ఏర్పాటు చేసుకున్నారు. రాత్రి పూజలో బాగంగా దీపం వెలిగించారు. దీపం ఆరిపోకుండా చూడడం కోసం చుట్టూ దుప్పట్లతో తెర ఏర్పాటు చేసుకున్నారు. అయితే.. గాలికి దుప్పటికి మంటలు అంటుకుని అగ్నిప్రమాదం జరిగింది. అయితే రాత్రి కావడంతో విద్యార్థులు గాఢ నిద్రలోకి జారిపోయారు. దుప్పట్లకు మంటలు అంటుకోవడం ఎవరూ గమనించలేదు. గదిలో దట్టమైన పొగ అలుముకోవడంతో కొందరు విద్యార్థులు కళ్లు తెరచిచూడగా గది మొత్తం మంటలు చెలరేగాయి. విద్యార్థులు కాపాడండి అంటూ అరవడం మొదలుపెట్టారు. మరికొందరు అక్కడనుంచి చాకచక్యంగా గదినుంచి బటయటకు పరుగులు తీశారు. అయితే మంటల్లో ఇద్దరు విద్యార్థులు చిక్కుకున్నారు. ఎలా బయటకు రావాలో వారికి అర్థంకాలేదు. ఎంత అరచినా ఎవరు కాపాడేందుకు ముందుకు రాలేదు.
Also Read
- UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
- Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
- Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
- Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
నీరజ్, మరో విద్యార్థి మంటల్లో చిక్కుకుపోవడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గురుకుల యాజమాన్యం ఇద్దరు పిల్లలను కాపాడి ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలికి చేరుకున్న ఫిలిం నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంత జరుగుతున్న గురుకుల యాజమాన్యం ఏంచేస్తున్నారని? పిల్లల దగ్గర అధికారులు ఎందుకు లేదని? మంటలు అంటుకుని ప్రమాదం జరిగినా అప్పటి వరకు అక్కడ ఎవరూ లేకపోవడం పై పలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు గురుకుల అధికారులపై మండిపడుతున్నారు. సకాలంలో విద్యార్థులు బయటకు పరిగెత్తటంతో తప్పిన ముప్పు తప్పిందని, ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంటలు అంటుకున్నప్పుడే స్పందించి ఉంటే ఆ ఇద్దరు విద్యార్థులకు కూడా ప్రమాదం తప్పేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Vishal : హీరో విశాల్ తీరు పై ఆగ్రహం వ్యక్తం చేసిన మద్రాస్ హైకోర్ట్…
తాజావార్తలు
-
UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
-
DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ‘డిగ్గర్’
-
Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
-
Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
ట్రెండింగ్
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?