Tata Ace Fire Incident in Jangaon District: జనగామ జిల్లాలో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. చిల్పూర్ మండలం వంగాలపల్లి వద్ద మంగళవారం ఉదయం ఓ టాటా ఏస్ వాహనం దగ్దం అయింది. మంటలు గమనించిన ప్రయాణికులు హుటాహుటిన వాహనం నుంచి కిందికి దిగిపోయారు. దాంతో వారు తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. టాటా ఏస్ వాహనం రన్నింగ్ లో ఉండగానే మంటలు అంటుకున్నాయి. డ్రైవర్ అప్రమత్తతతో ఎవరికీ గాయాలు కాలేదు. షాట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయని సమాచారం తెలుస్తోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

