Site icon NTV Telugu

Tarun Chugh: తెలంగాణలో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తాది..!

Tarun Chughe

Tarun Chughe

రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి కేసీఆర్ కు ఎదురుదెబ్బ తగలడం ఖాయమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ అన్నారు. నిన్న ( మంగళవారం ) ప్రకటించిన 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా చూస్తే అర్థమవుతోంది అని ఆయన అన్నారు. ఎమ్మెల్యేలపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయని, నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని, వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామంటూ గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఈ సారి పెద్ద ఎత్తున మార్పులు ఉంటాయని అంతా అనుకున్నారు. తీరా అభ్యర్థులను చూస్తే 7 చోట్ల మినహా దాదాపు అందరు ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్ ఇచ్చారు.. కేసీఆర్, ఆయన పార్టీ సిగ్గు తప్పిన విధానాన్ని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు అని తరుణ్ చుగ్ అన్నారు.

Read Also: Kalki 2898AD: ఇది కదా మనకు కావాల్సిన ఎమోషన్.. చిరును ఇమిటేడ్ చేసిన ప్రభాస్

ఈసారి కనీసం 20 మంది కొత్త అభ్యర్థులు ఉంటారన్నారు కేసీఆర్ చెప్పారు.. కానీ, అలా జరగలేదు అని తరుణ్ చుగ్ తెలిపారు. నిన్న కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితా పాత సీసాలో పాత సారానే పోసినట్లుందని అన్నారు. పాచిపోయిన కూరను మళ్లీ వేడి చేసి ప్రజలకు అందించే ప్రయత్నంలో కేసీఆర్ ఉన్నారు అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి చెప్పారు. పతాక స్థాయికి చేరిన కేసీఆర్, ఆయన ప్రభుత్వ అవినీతిపై ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు అని తరుణ్ చుగ్ తెలిపారు. కేసీఆర్ స్వయంగా పెద్ద అవినీతిపరుడు.. అవినీతిలో ఆవిష్కరిస్తున్న కొత్త విధానాలకు ఆస్కార్ అవార్డు ఇచ్చేదుంటే కేసీఆర్ ఈ అవార్డుకు అన్నివిధాల అర్హుడని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి చుగ్ పేర్కొన్నాడు.

Read Also: Onions: 4 నెలలు ఉల్లి తినకుంటే పోయేదేం లేదు.. మంత్రి హాట్ కామెంట్స్

ఈ జాబితా కేసీఆర్ అవకాశవాదానికి మరో నిదర్శనం.. ఇటీవల మునుగోడు ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంలతో దోస్తీ కట్టి.. ఇప్పుడు వారిని వదిలేశాడు అని తరుణ్ చుగ్ అన్నారు. ఇదీ కేసీఆర్ నైజం. తన స్వలాభం కోసం ప్రజలను వాడుకుని, పని పూర్తయ్యాక వదిలేస్తాడు.. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఆయన ఇదే చేశారు.. విద్యార్థులను, ఉద్యోగులను, నిరుద్యోగులను ఉద్యమానికి ఉపయోగించుకుని, రాష్ట్రం ఏర్పడ్డాక వారికి ద్రోహం చేశారు అని ఆయన అన్నారు. కేసీఆర్ అవకాశవాదం, ద్వంద్వ వైఖరి, వాడుకొని వదిలేసే విధానం గురించి తెలుసుకున్న ప్రజలు తమ ఓటుతో బీఆర్‌ఎస్‌ను బంగాళాఖాతంలోకి కలిపేందుకు సిద్ధంగా ఉన్నారని చుగ్ చెప్పుకొచ్చాడు.

Read Also: Kushi : సెన్సార్ పూర్తి చేసుకున్న లవ్ అండ్ రొమాంటిక్ మూవీ..

తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని తరుణ్ చుగ్ తెలిపారు. నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఇలా అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. తెలంగాణ ప్రజలు తమ ఆకాంక్షలు సాకారం చేసుకునేందుకు, కుటుంబ పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేసేందుకు బీజేపీ వైపు ఆశగా చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ తో తమ ఆకాంక్షలు నెరవేరుతాయని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు.. ఇక్కడి ప్రజలకు బీజేపీ అన్నివిధాలా అండగా ఉంటుంది అని తరుణ్ చుగ్ అన్నారు.

Exit mobile version