Tarun Chugh : కేంద్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ సర్కార్ మోసం చేస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వమని అందరికీ తెలిసిందే అని ఆరోపించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇంచార్జి తరుణ్ చుగ్. ఒకటే పనికి రెండు మార్గాల్లో నిధులు కేంద్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ సర్కార్ మోసం చేస్తోందని ఆయన మండిపడ్డారు. తక్షణమే సీబీఐ దర్యాప్తు జరిపించాలని తరుణ్ చుగ్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేస్తూ రాష్ట్రంలోని బీఆర్ఎస్ సర్కార్ ఒకే పనిని వేరువేరు పథకాల కింద చూపి, వాటికి రెండు సార్లు నిధులు రాబట్టి, స్వాహా చేయడం షాక్ కు గురి చేస్తుందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇంచార్జి తరుణ్ చుగ్ అన్నారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి మోసానికి పాల్పడడం దేశంలో ఇదే మొదటిసారని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వమని తీవ్రస్థాయిలో ఆరోపించారు.
Also Read : Uttar Pradesh: ప్రభుత్వ ఆఫర్.. అక్కడ సగం రేటుకే టమోటాలు..!
Also Read
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
- Bangladesh: బంగ్లాదేశ్‌కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి కేవలం భారీ నీటిపారుదల ప్రాజెక్టులకే పరిమితం కాలేదంటూ నిజామాబాద్ జిల్లాకు చెందిన 6 రోడ్డు ప్రాజెక్టులలోనూ పెద్దఎత్తున అవినీతి జరిగిందన్నారు. ఒకే పనిని రెండు పథకాల కింద చూపడంతో, రెండు సార్లు విడుదలైన నిధులను స్వాహా చేసిందన్నారు. ఈ రోడ్డు ప్రాజెక్టులను రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ రుణం కింద ఒకసారి, కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక సహాయం కింద రెండోసారి చూపి కేసీఆర్ సర్కార్ కేంద్ర ప్రభుత్వ సంస్థలను బురిడీ కొట్టించిందని వ్యాఖ్యానించారు. అంటే ఒకే పనికి రెండు వేర్వేరు మార్గాల ద్వారా నిధులు రావడంతో, రెట్టింపునిధులు విడుదలయ్యాయని అన్నారు.
Also Read : World Cup: ప్రపంచ కప్‌కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్.. వాళ్లు వచ్చేస్తున్నారు..!
ఫలితంగా కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక సహాయ పథకం కింద విడుదలైన రూ.4,144 కోట్లు పక్కదారి పట్టినట్లు స్పష్టమవుతుందన్నారు. ఈ పథకం కింద అమలు చేసినట్టు చూపించిన పనులు రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ రుణం ద్వారా అమలు చేసిన పనులే ఉన్నాయి. ఇది పెద్ద కుట్ర, మోసం, దీనిపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని తరుణ్ చుగ్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక సహాయం కింద గత తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ రహదారుల పనులు, తెలంగాణ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా పొందిన రుణాలు సహా అన్ని ప్రాజెక్టులపై సీబీఐ విచారణ జరిపించాలని తరుణ్ చుగ్ డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
-
Samantha: బేబీ బంప్‌తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
-
Vivo X Fold 6: వివో X Fold 6 త్వరలో మార్కెట్లోకి.. Geekbenchలో లిస్టింగ్.. 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీ
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Idol Cleaning Tips : గణేష్ చతుర్థికి ఇంట్లోనే విగ్రహాలకు ఇలా కొత్త మెరుపు
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!