Tanushree Dutta: ఒకప్పుడు బాలీవుడ్‌లో గ్లామర్ తారగా వెలిగిన తనుశ్రీ దత్తా, ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలతో వార్తల్లో నిలిచింది. కెరియర్ ప్రారంభంలో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న ఈ అందాల తార, 2004లో ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ టైటిల్ గెలుచుకుని సినీ రంగంలో అడుగుపెట్టింది. అదే ఏడాది విడుదలైన “ఆషిక్ బనాయా ఆప్‌నే” సినిమాతో బోల్డ్ గ్లామర్ పాత్ర ద్వారా బాలీవుడ్ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది.
Varun Sandesh: బర్త్‌డే స్పెషల్.. భర్త పుట్టినరోజుకి వితికా ఇచ్చిన భారీ సర్ప్రైజ్ మాములుగా లేదుగా..!
ఆ తర్వాత గుడ్ బాయ్.. బాడ్ బాయ్.., భాగం భగ్, రిస్క్, ది గ్రేట్ ఇండియన్ బటర్‌ఫ్లై వంటి హిందీ సినిమాల్లో నటించి తన నటనా ప్రతిభను చాటుకుంది. కేవలం నటి మాత్రమే కాకుండా మోడల్‌గానూ ఆమె దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది. 2005లో తెలుగులో “వీరభద్ర” సినిమాలో నటించి సౌత్ ఇండస్ట్రీకి పరిచయమైంది. అయినా ఎక్కువగా ఆమె బాలీవుడ్‌కే పరిమితమయ్యింది. 2018లో తనుశ్రీ దత్తా మరోసారి మీడియా దృష్టిని ఆకర్షించింది. #MeToo ఉద్యమంలో భాగంగా ప్రముఖ నటుడు నానా పాటేకర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే, ఈ కేసులో నానా పాటేకర్‌కు క్లీన్ చిట్ లభించింది. అయినప్పటికీ.. తనుశ్రీ తెచ్చిన ఆ గొంతు బాలీవుడ్‌లోని అనేక మహిళలకు బలాన్ని ఇచ్చింది.
HHVM : తూర్పుగోదావరి జిల్లాలో హరిహర వీరమల్లు ఆల్ టైమ్ రికార్డ్.. పవర్ స్టార్ మాస్
ఇప్పుడు మళ్లీ ఆమె పేరు వార్తల్లో నిలుస్తోంది. దీనికి కారణం.. తన ఇంట్లోనే వేధింపులకు గురవుతున్నట్టు కన్నీటి వీడియో ద్వారా వెల్లడించింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియోలో తనుశ్రీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. నా ఇంట్లోనే నాకు భద్రత లేకుండా పోయింది. నన్ను ఇక్కడ వేధిస్తున్నారు. ఈ బాధ తట్టుకోలేకపోతున్నా. ఎవరైనా దయచేసి సాయం చేయండి. రేపో ఎల్లుండో పోలీసులకు వెళ్తాను అంటూ విలపించింది. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు, అభిమానులు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.