Tantra : ఆడియన్స్ ను భయపెట్టేందుకు వచ్చేస్తున్న “తంత్ర”.. రిలీజ్ ఎప్పుడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య నాగెళ్ల నటించిన లేటెస్ట్ చిత్రం “తంత్ర “. మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని హీరోయిన్ అనన్య స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.ఇన్ని రోజులు గ్లామరస్, కూల్ క్యారెక్టర్స్ చేసిన ఈమె ఇప్పుడు హారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.”ఈ క్రతవుకు మీరు తప్పకుండా రావాలి.. మార్చి 15న థియేటర్లలో ‘తంత్ర’ అనే పోస్టర్ ని ఆమె పోస్ట్ చేసింది. దివంగత నటుడు శ్రీహరి తమ్ముడి కుమారుడు ధనుష్ రఘుముద్రి హీరోగా పరిచయం అవుతున్న చిత్రమిది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.’మల్లేశం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన అనన్యా నాగళ్ల . ‘ప్లే బ్యాక్’ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది.
అచ్చతెలుగు అమ్మాయిలా ఎన్నో పాత్రలు చేసిన అనన్య. ఇప్పుడు ‘తంత్ర’ సినిమాతో సరికొత్తగా కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి పోస్టర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాపై బాగా హైప్ క్రియేట్ చేశాయి.’కాలగర్భంలో కలసిపోయిన మన తాంత్రిక శాస్త్రాన్ని తెరిస్తే… అందులో ఊహకందని రహస్యాలు ఎన్నో’ అంటూ వచ్చిన ‘తంత్ర’ టీజర్ ఎంతగానో ఆకట్టుకుంది. ఆ ఊరిలో దుష్టశక్తి పుట్టిందని మరో గొంతు వినిపిస్తుంటే… తెరపై క్షుద్రపూజలు వంటివి కనిపించాయి. ఇక ఆ టీజర్ లో ప్రతీ సీన్ కూడా భయపెట్టేలా ఉంది. ఇక ఈ సినిమాలో అనన్యతో పాటు.. మరో హీరోయిన్ సలోని తెలుగు తెరకు రీ ఎంట్రీ ఇస్తున్నారు. గ్లామర్ రోల్స్ చేసి మెప్పించిన సలోని ‘తంత్ర’లో డిఫరెంట్ గెటప్ లో కనిపించనున్నారు.ఈ మూవీని ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్, వి ఫిల్మ్ ఫ్యాక్టరీ సంస్థలపై నరేష్ బాబు పి మరియు రవి చైతన్య నిర్మిస్తున్నారు.
Also Read
- Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
https://twitter.com/AnanyaNagalla/status/1759836624245105071
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్‌లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!