NTV Telugu Site icon

Taneti Vanitha : ఏదో రకంగా ప్రభుత్వంపై బురద జల్లడానికే చంద్రబాబు ప్రయత్నం

Taneti Vanitha

Taneti Vanitha

గన్నవరంలో జరిగిన దాడులో గాయాలపాలైన సీఐని హోంశాఖ మంత్రి తానేటి వనిత పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇలాంటి దాడులను పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. పోలీసులు డ్యూటీ చేయడం వల్లనే అందరూ హ్యపీగా ఉంటున్నారని, 40 ఏళ్ల ఇండస్ట్రీ, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పోలీసులను కించపరుస్తూ మాట్లాడటం సరికాదని ఆమె హితవు పలికారు. ఏదో రకంగా ప్రభుత్వంపై బురద జల్లడానికే చంద్రబాబు విమర్శిస్తున్నారని ఆమె మండిపడ్డారు.

Also Read : Clash With Cops: అమృత్‌సర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. తుపాకులు, కత్తులతో పోలీస్‌స్టేషన్‌ ముట్టడి

అనపర్తిలోని ఉద్దేశపూర్వకంగా సభకు అనుమతులు లేకున్న పోలీసులను ఇబ్బందులు పెట్టడానికి మూర్ఖత్వంగా వ్యవహరిస్తున్నారని ఆమె విమర్శించారు. పోలీసులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆమె వెల్లడించారు. లోకేష్ సైతం ఉద్దేశపూర్వకంగానే టేబుల్ పై నుంచొని మరీ సభలు నిర్వహిస్తున్నాడని తానేటి వనిత విమర్శించారు. పట్టాభి కోర్టులో తనపై ధర్డ్ డిగ్రీ జరిగిందంటూ ఆరోపణలు చేశారని. అబద్దాలకు పట్టాభిషేకం చేస్తే ఎలా ఉంటాడో అలాగా ఉన్నాడు పట్టాభి అని తానేటి వనిత సెటైర్లు వేశారు. గెదే చెలో మెస్తే దూడ ఎక్కడా మేస్తుందో అదే విధంగా టీడీపీ నేతలు వ్యవహారిస్తున్నారన్నారు. ప్రభుత్వాన్ని, పోలీసులను ఉద్దేశపూర్వకంగానే ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read : America: మంచు గుప్పిట్లో అగ్రరాజ్యం.. 1500కు పైగా విమానాలు రద్దు

Show comments