సామాజిక మాధ్యమాల వేదికగా రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవడం సర్వసాధారణమైపోయింది. కొన్ని సందర్భాల్లో ఇది శృతికి మించి వివాదాలకు దారితీస్తోంది. లేని వాటిని ఉన్నట్లు, ఉన్నవాటిని లేనట్లు చిత్రీకరించి.. ఎదుటివారి భావోద్వేగాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతుండటంతో పార్టీల మధ్యే కాదు, సాధారణ ప్రజల మధ్య కూడా చిచ్చు పెడుతున్నాయి. ఇలాంటి వాటిని నివారించేందుకు తాండూరు పోలీసు శాఖ అధికారులు నజర్ పెట్టారు.
Read Also: Shocking: సోషల్ మీడియాలో హీరోయిన్ ప్రైవేట్ వీడియోలు లీక్.. అతని పనేనంటూ కేసు నమోదు!
ఇవాళ (బుధవారం) తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ మాట్లాడుతూ.. తాండూరు నియోజకవర్గంలో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న వివాదాస్పద పోస్టులపై దృష్టి పెట్టినట్లు ఆయన వెల్లడించారు. ఫేస్ బుక్, వాట్సాప్ తదితర సోషల్ మీడియా ఫ్లాట్ ఫారాలపై నిఘా ఉంచినట్లు డీఎస్పీ పేర్కొన్నాడు. సోషల్ మీడియాను మంచికే ఉపయోగించుకోవాలన్నారు. రాజకీయ పార్టీలు అభివృద్ధికి వాడుకోవాలని డీఎస్పీ శేఖర్ గౌడ్ చెప్పాడు. లేనిపోని వివాదాస్పదమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. వివాదాలకు, విఘాదాలకు కారణమయ్యే పోస్టులు పెడితే సుమోటోగా కేసును స్వీకరించి కేసులు నమోదు చేసే అవకాశం ఉందన్నారు. ప్రజలు, వినియోగ దారులు సోషల్ మీడియాను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని తాండూర్ డీఎస్పీ శేఖర్ గౌడ్ సూచించారు.
Read Also: AP High Court: రుషికొండపై నిర్మాణాలు.. హైకోర్టు కీలక ఆదేశాలు
సోషల్ మీడియాలో, వాట్సప్ గ్రూపులలో మీ ప్రాంతం అభివృద్ధి కోసం జరిగే చర్చలు ఉండాలని నియోజకవర్గంలో ఉన్న అన్ని వాట్సప్ గ్రూపులపై సోషల్ మీడియాపై తమ ప్రత్యేక దృష్టి ఉంచమని తాండూర్ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు. సోషల్ మీడియాలో ఎవరైనా అసభ్యకర పదజాలం వాడిన, పోస్టులు పెట్టిన తమకు ఫిర్యాదు చేయాలని లేకపోతే తామే సుమోటోగా స్వీకరించి వారిపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన మెసేజ్ లు పెట్టిన కొందరు వ్యక్తులను కూడా బైండోవర్ చేయనున్నట్లు డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు.