NTV Telugu Site icon

Tammudu Re-Release : అయ్యా బాబోయ్.. ఇదేం మాస్ సెలబ్రేషన్స్ బాబు..

Pawan Kalyan

Pawan Kalyan

ammudu Re-Release : ఈ మధ్యకాలంలో పాత సినిమాలు రీ రిలీజ్ గా అవుతున్న సంగతి తెలిసిందే. ఇదివరకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలైనా బద్రి, వకీల్ సాబ్, ఖుషి సినిమాలు రీరిలీజ్ అయ్యాయి. ఇక తాజాగా పవన్ నటించిన సినిమా తమ్ముడు సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా వచ్చి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంలో మరోసారి ఈ సినిమా ప్రేక్షకులను అలరించడానికి సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. ఇకపోతే అప్పట్లో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సినిమా రిలీజ్ అవ్వడంతో పవన అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.

Railway Board: రైలు డ్రైవర్ల వేగ ఉల్లంఘనను సమీక్షించడానికి రైల్వే బోర్డు కమిటీ..

ఈ నేపథ్యంలో తమ్ముడు సినిమా రిలీజ్ ను మరింత ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మెగా అభిమానులు. డిప్యూటీ సీఎం సినిమా 25 ఏళ్ల క్రితం ఇలా అదరగొట్టాడంటూ.. తమ్ముడు రిలీజ్ సెలబ్రేషన్స్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని సుదర్శన్ థియేటర్ వద్ద తమ్ముడు రిలీజ్ సందర్భంగా హీరోగా కాకుండా రాజకీయ నాయకుడులా కనిపించే ఓ పెద్ద కటౌట్ ను ఏర్పాటు చేశారు పవన్ అభిమానులు.

Public Toilet: ఇదేంటి భయ్యా.. పబ్లిక్ టాయిలెట్ బయట టైమర్స్.. అసలేమీ జరుగుతుంది..

అంతేకాదు కట్ అవుట్ కు ఇరువైపులా భారీగా ఫైర్ వర్క్స్ పెట్టి నానా హంగామా చేశారు. కట్ అవుట్ పై పూలు భారీగా ఎగరవేసి, థియేటర్ బయట డాన్సులు వేస్తూ పెద్దగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక ఈ వీడియోలో చూసిన నెటిజెన్లు వామ్మో ఇదెక్కడి సెలబ్రేషన్స్ రా బాబు.. కొత్త సినిమా రిలీజ్ అవుతున్న సమయంలో కూడా అభిమానులు ఈ రేంజ్ లో చేసుకుంటారో లేదో కానీ.. రీ రిలీజ్ కు ఇలా చేస్తున్నారంటే., అది కేవలం పవన్ కి మాత్రమే సాధ్యమంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఈ వైరల్ వీడియోను ఓసారి వీక్షించండి.