Site icon NTV Telugu

Tammineni: పొత్తు ఉన్నా లేకున్నా రెండు స్థానాల్లో పోటీ చేస్తాం..

Tammineni Veerabhadram

Tammineni Veerabhadram

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌తో పొత్తు విషయంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో సీపీఎం రెండు స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. పొత్తు ఉన్నా లేకున్నా రెండు ఎంపీ సీట్లలో పోటీ చేస్తామని తమ్మినేని తెలిపారు. లోక్ సభలో కాంగ్రెస్ తో పొత్తు ఉంటుందా లేదా అనేది కాంగ్రెస్ తేల్చాలి అని అన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు ఉండాలని ప్రతిపాదనలు ఉన్నాయని పేర్కొన్నారు. కమ్యునిస్టులతో కలిసి పనిచేయాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం సుముఖంగా ఉందని ఆయన చెప్పారు.

Read Also: Purandeswari: పొత్తులు ఏ రకంగా ఉన్నా.. అన్ని పార్లమెంట్, అసెంబ్లీలో పోటీకి రెడీ..

మరోవైపు.. కాంగ్రెస్ పట్ల బీఆర్ఎస్ శత్రుపూరిత వైఖరి అవలంభిస్తోందని తెలిపారు. గత ప్రభుత్వ అవినీతి సొమ్మును కక్కించేందుకు ప్రభుత్వానికి సహకరిస్తామని తమ్మినేని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం ఒంటరిగా పోటీ చేసినప్పటికీ.. ఒక్క స్థానంలోనూ గెలవలేకపోయింది. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు మాత్రం ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరోవైపు.. కేంద్రంలో వామపక్షాలు కాంగ్రెస్‌కు మద్ధతు ఇస్తున్న సంగతి తెలిసిందే.

Read Also: TDP-Janasena: టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ భేటీ.. వాటిపై ఫోకస్‌

Exit mobile version