Site icon NTV Telugu

Tammineni Veerabhadram: పేదల ఇండ్లు, ఇళ్లస్థలాలకై త్వరలో కేసీఆర్‌ను కలుస్తా

Tammineni Veerabhadram

Tammineni Veerabhadram

జనగామ పట్టణంలో గత కొన్ని సంవత్సరాలుగా ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం పోరాడుతున్న పేదలకు సీపీఎం అండగా ఉంటుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మిగితా జిల్లాలతో పొలిస్తే జనగామలో విచిత్ర పరిస్థితి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. 2013లో అప్పటి ప్రభుత్వం 1,144 మందికి పట్టాలిచ్చి భూములను చూపించలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ స్థలంలో పేదలకు డబల్ ఇండ్లు నిర్మాణం చేసి ఇస్తామని, కొన్ని ఇండ్లు మాత్రమే నిర్మాణం చేసిందన్నారు తమ్మినేని వీరభద్రం.

Also Read : Karnataka election: కర్ణాటక బీజేపీ అగ్రనేతకు మోడీ ఫోన్.. ఈశ్వరప్ప విధేయత ప్రశంసలు

అర్హులకు సర్వే చేసి కేటాయించిన వాటిని మళ్ళీ రీసర్వే చేస్తామని చెప్పడం అన్యాయమని ఆయన వ్యాఖ్యానించారు. పేదల ఇండ్లు, ఇళ్లస్థలాలకై త్వరలో సీఎం కేసీఆర్‌ను కలుస్తానని ఆయన అన్నారు. అంతేకాకుండా.. అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు. కోర్టులో న్యాయం జరగకపోతే చనిపోయేదాకా పోరాడుతామని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రంతో పోరాడడానికి బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కానీ పేద ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడడానికైనా సిద్ధమని ఆయన వెల్లడించారు.

Also Read : Harish Rao: గులాబీ పార్టీ ప్రజలకు గులాంగిరి చేస్తుంది.. ఢిల్లీ పెద్దలకు కాదు..

Exit mobile version