Site icon NTV Telugu

Tammineni Veerabhadram : ప్రత్యామ్నాయం, పునరావాసం తర్వాతనే ఇండ్లు కూల్చాలి

Thammineni Veerabhadram

Thammineni Veerabhadram

ఎలాంటి ప్రత్యామ్నాయం, పునరావాసం కల్పించకుండానే హైదరాబాదు మూసీ నది పరిసర ప్రాంతాల్లో దశాబ్దాలుగా నివాసముంటున్న పేదల ఇండ్లు, గుడిసెలను హైడ్రా అధికారులు వెంటనే తొలగించేందుకు పూనుకోవడాన్ని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముందుగా పునరావాసం కల్పించిన తర్వాతనే ఇండ్లను కూల్చే పనిని చేపట్టాలని, మూసీ అభివృద్ధి పేరుతో పేదలను ఇబ్బందులకు గురిచేయవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నదన్నారు. మూసీ సుందరీకరణ పేరుతో హైదరాబాదులోని చాదర్‌ఘాట్‌, మూసానగర్‌, శంకర్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో ఎఫ్‌టిఎల్‌ జోన్‌లో దశాబ్దాలుగా వున్న 2వేలకు పైగా పేదల ఇండ్లు కూల్చడానికి హైడ్రా ప్రస్తుతం సర్వే చేసి మార్కింగ్‌ చేస్తున్నదన్నారు.

Puja Khedkar: ఢిల్లీ హైకోర్టులో ఉపశమనం.. అరెస్ట్ నుంచి రక్షణ పొడిగింపు

ఈ పేదలంతా కూలీ పని, చిన్నచిన్న షాపుల్లో ఇతర పనులు చేసుకుంటున్న పేద బలహీనవర్గాలకు చెందిన కుటుంబాలే ఎక్కువగా వున్నాయన్నారు తమ్మినేని వీరభద్రం. పేదరికం, ఆర్ధిక ఇబ్బందుల వల్ల గుడిసెలు వేసుకున్న వారు కొందరైతే, స్థలాలను కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్లు చేసుకుని, ఇంటి నిర్మాణానికి మున్సిపల్‌ పర్మిషన్‌ తీసుకుని ఇండ్లు కట్టుకున్నవారు కొందరున్నారని ఆయన అన్నారు. అందువల్ల వీరు నివాసం వుంటున్న సమీప ప్రాంతాల్లో ఇండ్లను కేటాయించాల్సిన అవసరం వున్నది. ప్రభుత్వం వీరికి హైదరాబాదు నగర శివార్లలో డబుల్‌బెడ్రూం ఇండ్లు ఇవ్వడం వల్ల రోజువారీ పనిచేసుకుంటున్న పేదలు వెళ్లడం ఆచరణలో సాధ్యం కాదు. కావున ప్రత్యామ్నాయం కల్పించకుండా ఇండ్ల తొలగింపునకు పూనుకోరాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నదని ఆయన అన్నారు.

Godhra Train Burning Case: “గోద్రా రైలు దహనం”పై జనవరి 15న సుప్రీంకోర్టు విచారణ..

Exit mobile version